WhatsApp Status: వాట్సప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి ఇలా

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ లేదా ఫేస్‌బుక్ లైట్, యాపిల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. మరి వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: January 12, 2020, 4:05 PM IST
WhatsApp Status: వాట్సప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి ఇలా
WhatsApp Status: వాట్సప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వాట్సప్‌లో స్టేటస్ ఫీచర్ ఉపయోగిస్తుంటారా? వాట్సప్‌లో బాగున్న స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలనుకుంటున్నారా? ఇది చాలా సింపుల్. మీరు డైరెక్ట్‌గా మీ వాట్సప్ నుంచి ఫేస్‌బుక్‌లోకి స్టేటస్ షేర్ చేయొచ్చు. వాట్సప్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇది. మీరు ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్ నుంచే నేరుగా ఫేస్‌బుక్‌లోకి మీ స్టేటస్‌ని షేర్ చేయడం సులువు. మీరు షేర్ చేసిన వాట్సప్ స్టేటస్ ఫేస్‌బుక్‌లో స్టోరీగా కనిపిస్తుంది. ఇందుకోసం మీరు ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మీ వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లోకి షేర్ చేసేముందు మీ యాప్స్ అప్‌డేట్ చేయాలి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ లేదా ఫేస్‌బుక్ లైట్, యాపిల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. మరి వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత స్టేటస్‌పైన క్లిక్ చేయండి. మీ ఫోన్‌లో స్టేటస్ క్రియేట్ చేయండి. ఆ తర్వాత స్టేటస్ ఓపెన్ చేయండి. మీకు Share to Facebook Story ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత Share Now పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు షేర్ చేసిన వాట్సప్ స్టేటస్ ఫేస్‌బుక్ స్టోరీగా కనిపిస్తుంది. ఒకవేళ మీ వాట్సప్ స్టేటస్‌లో వేర్వేరుగా అప్‌డేట్స్ ఉంటే వాటిని వేర్వేరుగా ఫేస్‌బుక్‌లోకి షేర్ చేయాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం





ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.7,500 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

 WhatsApp Status: వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నారా? త్వరలో ఈ సమస్య తప్పదు

App: మీ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను ఈ యాప్‌తో ఆపెయ్యండి
First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు