వాట్సప్‌లో 'అనుమానాస్పద లింక్' ఫీచర్!

వాట్సప్‌లో వచ్చేవన్నీ నిజాలు కావు. కల్పితాలు ఉంటాయి. వాటిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయి. బుట్టలో పడేసే మోసాలు ఉంటాయి. ఇకపై ఇలాంటి అనుమానాస్పద లింక్స్ ఏవైనా ఉంటే ముందే హెచ్చరిస్తుంది వాట్సప్.

news18-telugu
Updated: July 24, 2018, 3:21 PM IST
వాట్సప్‌లో 'అనుమానాస్పద లింక్' ఫీచర్!
వాట్సప్‌లో వచ్చేవన్నీ నిజాలు కావు. కల్పితాలు ఉంటాయి. వాటిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయి. బుట్టలో పడేసే మోసాలు ఉంటాయి. ఇకపై ఇలాంటి అనుమానాస్పద లింక్స్ ఏవైనా ఉంటే ముందే హెచ్చరిస్తుంది వాట్సప్.
  • Share this:
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెద్ద సమస్యగా మారిన ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. యూజర్లకు ఏదైనా అనుమానాస్పద పోస్ట్ వస్తే ఆ పోస్టుపై "సస్పీషియస్ లింక్" పేరుతో హెచ్చరిక కనిపిస్తుంది. ప్రస్తుతం కొత్త వర్షన్ 2.18.221 ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్, విండోస్ ఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులో లేదు. సామాన్యులకు త్వరలో ఈ ఫీచర్‌ను అప్‌డేట్‌లో అందించనుంది వాట్సప్.

WHATSAPP STARTS TO ROLLOUT ‘SUSPICIOUS LINK' DETECTION FEATURE ON ANDROID BETA
Image: WABetaInfo


లింక్స్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని విశ్లేషించి వెబ్ అడ్రస్‌లో ఏదైనా అసాధారణ ప్యాటర్న్ కనిపిస్తే ఈ హెచ్చరికను పంపిస్తుంది వాట్సప్. ఉదాహరణకు ఏదైనా బ్యాంక్ పేరుతో వెబ్‌సైట్ లింక్ వస్తే వాట్సప్ ఆల్గారిథమ్ విశ్లేషిస్తుంది. అది నిజంగా సదరు బ్యాంకుకు సంబంధించిన వెబ్‌సైట్ కాకపోతే 'సస్పీషియస్' అని రెడ్ లేబుల్ జత చేస్తుంది. ఆ హెచ్చరికతో మీరు లింక్ క్లిక్ చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే 2.18.221 బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ చూడొచ్చు. యాప్ అప్‌డేట్ అయి ఉన్నా ఈ ఫీచర్ కనిపించకపోతే మీ చాట్ హిస్టరీ బ్యాకప్ చేసి, వాట్సప్ రీఇన్‌స్టాల్ చేయండి. మీరు వాట్సప్ రీఇన్‌స్టాల్ చేసిన ప్రతీసారి అప్‌డేటెడ్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి.

ఫేక్‌న్యూస్ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం వాట్సప్‌పై ఒత్తిడి తీసుకురావడమే ఈ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టడానికి కారణం. గత ఏడాదిగా భారతదేశంలో వాట్సప్‌లోని ఫేక్ న్యూస్ ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి.
First published: July 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading