WhatsApp: వాట్సాప్ పేరు మారింది.. కొత్త పేరేంటో తెలుసా..

WhatsApp from Facebook | వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పేరుతో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను మనం ఇప్పటి వరకు వాట్సాప్ అని పిలవగా.. ఇప్పటి నుంచి ‘వాట్సాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్’ అని పిలవాల్సి ఉంటుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 20, 2019, 11:38 AM IST
WhatsApp: వాట్సాప్ పేరు మారింది.. కొత్త పేరేంటో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త హంగులతో యూజర్లకు కొత్త అనుభూతిని అందిస్తున్న వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పేరుతో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను మనం ఇప్పటి వరకు వాట్సాప్ అని పిలవగా.. ఇప్పటి నుంచి ‘వాట్సాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్’ అని పిలవాల్సి ఉంటుంది. అయితే, కేవలం యాప్స్ పేర్లు మాత్రమే మారతాయి తప్ప... ఫీచర్స్ అలాగే ఉండనున్నాయి. వాస్తవానికి, వాట్సాప్.. ఫేస్‌బుక్‌కు చెందినదేనన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే యాప్ పేరులో ఫేస్‌బుక్ చేర్చడం ద్వారా అవి ఫేస్‌బుక్ కంపెనీ చెందినవిగా ప్రమోట్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో పేరును WhatsApp from Facebook గా మార్చుకుంది. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో ఈ పేరు కనిపిస్తుండగా, అన్ని వెర్షన్లకు త్వరలోనే కనిపించనుంది. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్ పేరును కూడా Instagram from Facebook గా మార్చే ఆలోచనలో ఉంది ఫేస్‌బుక్.

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఫేస్‌బుక్ రూపొందించలేదు. వాట్సాప్‌ను యాహూ మాజీ ఉద్యోగులైన బ్రెయిన్‌ ఆక్టన్‌, జాన్‌ కోమ్‌ 2009లో స్థాపించారు. అయితే.. 2014 ఫిబ్రవరి 19న 19.3 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ను కెవిన్ సిస్‌ట్రామ్, మైక్ క్రీగర్ రూపొందించారు. 2012లో బిలియన్ డాలర్లకు దీన్ని ఫేస్‌బుక్ దక్కించుకుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 20, 2019, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading