మీ వాట్సప్‌లో ఈ ఫీచర్ ఉందా?

వాట్సప్‌‌లో గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఈ ఫీచర్ అప్‌డేట్ చేస్తోంది వాట్సప్.

news18-telugu
Updated: July 31, 2018, 10:39 AM IST
మీ వాట్సప్‌లో ఈ ఫీచర్ ఉందా?
వాట్సప్‌‌లో గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఈ ఫీచర్ అప్‌డేట్ చేస్తోంది వాట్సప్.
  • Share this:
వాట్సప్ యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేసింది. ఇకపై మీ వాట్సప్‌ నుంచి గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది కంపెనీ. గ్రూప్ వీడియో కాల్‌లో ఒకేసారి నలుగురు పాల్గొనే అవకాశముంది.

గ్రూప్ కాల్ ఎలా చేయాలి?

1. గ్రూప్ కాల్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవరో ఒకరికి కాల్ చేయాలి.
2. ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో "యాడ్ పార్టిసిపేట్" బటన్‌‌పై క్లిక్ చేయాలి.
3. అలా మరో ముగ్గుర్ని వీడియో లేదా వాయస్ కాల్‌లో యాడ్ చేయొచ్చు.

WHATSAPP STARTS THE ROLL-OUT OF GROUP VIDEO AND VOICE CALLING FOR IOS AND ANDROID

అయితే ఇందుకోసం ముందుగా వాట్సప్‌ని అప్‌డేట్ చేయాలి. మెసేజెస్ లాగానే గ్రూప్ కాల్స్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తోంది వాట్సప్. ప్రస్తుతం రోజూ రెండువందల కోట్ల నిమిషాల వాట్సప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారని ఆ కంపెనీ లెక్క. ఇప్పుడు గ్రూప్ కాల్స్ సదుపాయం రావడంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశముందని అంచనా. ఫేస్‌బుక్‌కు చెందిన మూడు యాప్స్ (ఇన్‌స్ట్రాగ్రామ్, మెసెంజర్, వాట్సప్‌) ఇప్పుడు వీడియో కాల్స్ సపోర్ట్ చేస్తుండటం విశేషం.
Published by: Santhosh Kumar S
First published: July 31, 2018, 10:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading