WHATSAPP STARTS TESTING THE BAN APPEAL FEATURE ON ITS PLATFORM UMG GH
WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్తగా బ్యాన్ అప్పీల్ ఫీచర్.. దీంతో ప్రయోజనం ఏంటంటే..?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్
వాట్సాప్.. బ్యాన్ లిఫ్ట్ చేయాలని యూజర్లు యాప్‌లోనే అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. బ్యాన్ అప్పీల్ (Ban Appeal) పేరుతో ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల బీటా వెర్షన్లలో వాట్సాప్ టెస్ట్ చేయడం ప్రారంభించింది.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)ను కోట్లాది మంది యూజర్లు వినియోగిస్తున్నారు. అయితే వీరందరి కోసం తన ఫ్లాట్‌ఫామ్ (Platform)ను సురక్షితంగా ఉంచేందుకు వాట్సాప్ తరచుగా సరికొత్త సేఫ్టీ (Saftey) ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ ఆటోమేటెడ్ సిస్టమ్ (Automated System) పరిచయం చేసింది. ఈ సిస్టమ్ వాట్సాప్ నిబంధనలు, షరతులను పాటించని యూజర్ల అకౌంట్స్‌ను బ్యాన్ (Ban) చేస్తోంది. అయితే ఒక్కోసారి ఈ సిస్టమ్ అనుకోకుండా అకౌంట్స్‌ను బ్యాన్ (Accidental Ban) చేస్తుంది. ఇలాంటి బ్యాన్‌ను తొలగించాలని రిక్వెస్ట్ చేయడం లాంగ్ ప్రాసెస్ కావడంతో యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన వాట్సాప్.. బ్యాన్ లిఫ్ట్ చేయాలని యూజర్లు యాప్‌లోనే అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. బ్యాన్ అప్పీల్ (Ban Appeal) పేరుతో ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల బీటా వెర్షన్లలో వాట్సాప్ టెస్ట్ చేయడం ప్రారంభించింది.
సాధారణంగా వాట్సాప్ ఆటోమేటెడ్ సిస్టమ్ స్పామ్ లేదా స్కామ్ మెసేజ్‌లు.. అసభ్యకరమైన, హింసాత్మకమైన, బెదిరింపు మెసేజ్‌లు పంపే యూజర్ల ఖాతాలను గుర్తించి బ్యాన్ విధిస్తుంది. కానీ ఏ కారణం లేకుండా అనుకోకుండా వాట్సాప్ అకౌంట్‌ను ఆటోమేటెడ్ సిస్టమ్ బ్యాన్ చేస్తే యూజర్లకు తిప్పలు తప్పవు. ఈ అకౌంట్‌పై బ్యాన్ తొలగిపోవాలంటే.. బ్యాన్‌ను లిఫ్ట్ చేయాలని వాట్సాప్‌కు విజ్ఞప్తి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అందుకే సింపుల్‌గా యాప్‌లోనే బ్యాన్ అప్పీల్ ఫీచర్ ఇవ్వాలని వాట్సాప్ నిర్ణయించినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా తెలిపింది. వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ యాప్‌లోనే ఈ ప్రక్రియను యాడ్ చేయడం ద్వారా మొత్తం బ్యాన్ అప్పీల్ ప్రాసెస్‌ను సులభతరం చేయనుంది.
రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యాప్స్‌లో బిల్ట్-ఇన్ బ్యాన్ అప్పీల్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే బీటా టెస్టర్లు ఈ కొత్త ఫీచర్ సాయంతో తమ అకౌంట్ బ్యాన్‌ను రీచెక్ చేయమని వాట్సాప్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా బ్యాన్‌కు గురైతే యూజర్లు సులభంగా తమ అకౌంట్‌పై బ్యాన్‌ను తొలగించుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా, తక్కువ సమయంలో పూర్తి అయిపోతుంది. ఈ ఫీచర్ యాప్ సెటప్ స్క్రీన్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, యూజర్లు తమ బ్యాన్ అప్పీల్‌కు ముందు ఖాతా నిషేధానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అప్పీల్ తరువాత అకౌంట్ అనుకోకుండా బ్యాన్ అయిందని వాట్సాప్ సపోర్ట్ గుర్తిస్తే, బ్యాన్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ముందుగా చెప్పినట్లు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను రెగ్యులర్ యూజర్లందరికీ వాట్సాప్ ఎప్పుడు విడుదల చేస్తుందనేది తెలియాల్సి ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.