వాట్సప్ యూజర్లను స్పైవేర్ టార్గెట్ చేసిందన్న వార్తలు కొద్ది రోజులుగా కలకలం రేపుతున్నాయి. MP4 ఫైల్స్ పంపించి వాట్సప్ హ్యాక్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. స్పైవేర్ దాడి చేసి మీ అనుమతి లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడే అవకాశముందని భారతదేశానికి చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా(CERT-In) హెచ్చరిస్తోంది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా(CERT-In) భారతదేశానికి చెందిన నోడల్ ఏజెన్సీ. హ్యాకింగ్, ఫిషింగ్ లాంటి వాటి నుంచి ఇండియన్ ఇంటర్నెడ్ డొమైన్ రక్షిస్తుంది. MP4 ఫైల్ ద్వారా జరిగే దాడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ భావిస్తోంది. స్పైవేర్ దాడిని అడ్డుకోవడానికి వాట్సప్ యూజర్లందరూ వెంటనే తమ యాప్ అప్‌డేట్ చేయాలని హెచ్చరిస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ ద్వారా వందలాది మంది భారతీయ యూజర్లను టార్గెట్ చేసినట్టు సెప్టెంబర్‌లోనే భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది వాట్సప్. దీంతో సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ రంగంలోకి దిగింది. స్పైవేర్ దాడి చేసిన వాట్సప్ వర్షన్లు ఇవే.
వాట్సప్ ఆండ్రాయిడ్: 2.19.274 వర్షన్ కన్నా ముందు
వాట్సప్ ఐఓఎస్: 2.19.100 వర్షన్ కన్నా ముందు
వాట్సప్ ఎంటర్‌ప్రైజ్ క్లైంట్: 2.25.3 వర్షన్ కన్నా ముందు
వాట్సప్ విండోస్: 2.18.368 వర్షన్ కన్నా ముందు
వాట్సప్ బిజినెస్-ఆండ్రాయిడ్: 2.19.104 వర్షన్ కన్నా ముందు
వాట్సప్ బిజినెస్-ఐఓఎస్: 2.19.100 వర్షన్ కన్నా ముందు
ఒకసారి మీ వాట్సప్ వర్షన్ ఏది ఉందో చెక్ చేసుకోండి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి మీ యాప్ అప్‌డేట్ చేయండి.
మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?
ఇవి కూడా చదవండి:
Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్‌మీ 5ఎస్ ధర రూ.9,999
Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్‌మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?
Tata Sky: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇస్తున్న టాటాస్కై
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Ios, Mobile App, Playstore, Whatsapp