WhatsApp Chat: వాట్సప్‌లో ఈ షార్ట్‌కట్ మీకు తెలుసా?

WhatsApp Chat Shortcut | మీరు వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాట్సప్ యాప్ ఓపెన్ చేసి ఎవరికైతే మెసేజ్ పంపాలో వారి పేరు వెతుకుతారు. మీరు తరచూ ఛాట్ చేసేవారి వాట్సప్ ఛాట్ షార్ట్‌కట్‌ను మీ స్క్రీన్‌పైన పెట్టుకోవచ్చు.

news18-telugu
Updated: March 26, 2019, 4:01 PM IST
WhatsApp Chat: వాట్సప్‌లో ఈ షార్ట్‌కట్ మీకు తెలుసా?
WhatsApp Chat: వాట్సప్‌లో ఈ షార్ట్‌కట్ మీకు తెలుసా?
  • Share this:
వాట్సప్‌... ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్. ఈ యాప్ గురించి తెలియనివాళ్లుండరు. వాట్సప్ అందించే ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. ఆకట్టుకుంటాయి. అందుకే కోట్లాది మంది వాట్సప్ ఉపయోగిస్తుంటారు. అయితే వాట్సప్‌లో చాలా ఫీచర్లు, షార్ట్ కట్స్ అందరికీ పూర్తిగా తెలియవు. వాటిని బాగా ఉపయోగించుకుంటే వాట్సప్ ఇంకా ఆకట్టుకోవడం ఖాయం. వాట్సప్‌లో ఛాట్ షార్ట్‌కట్ ఫీచర్ అలాంటిదే. మీరు వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాట్సప్ యాప్ ఓపెన్ చేసి ఎవరికైతే మెసేజ్ పంపాలో వారి పేరు వెతుకుతారు. మీరు తరచూ ఛాట్ చేసేవారి వాట్సప్ ఛాట్ షార్ట్‌కట్‌ను మీ స్క్రీన్‌పైన పెట్టుకోవచ్చు. అదెలాగో... దానివల్ల లాభమేంటో తెలుసుకోండి.

Read this: WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...

వాట్సప్‌లో ఛాట్ షార్ట్‌కట్ ఫీచర్ ఇలా వాడాలి



ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
మీరు ఎవరి ఛాట్ విండో షార్ట్‌కట్‌గా పెట్టుకోవాలంటే వారి కాన్వర్జేషన్ ఓపెన్ చేయండి.


కుడివైపు టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.
త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్స్‌లో More క్లిక్ చేయండి.
Loading...
చివర్లో Add shortcut పైన క్లిక్ చేయండి.
Add to Homescreen అనే విండో కనిపిస్తుంది. అందులో Add బటన్ క్లిక్ చేయండి.
మీ ఫోన్ హోమ్‌స్క్రీన్‌పైన మీ ఫేవరెట్ ఛాట్ షార్ట్‌కట్ కనిపిస్తుంది.
ఇక మీరు ఎప్పుడైనా మీ ఫేవరెట్ ఛాట్ క్లిక్ చేసి నేరుగా ఛాటింగ్ చేసుకోవచ్చు.
హోమ్‌స్క్రీన్‌పై షార్ట్‌కర్ట్ పెట్టుకోవడం వల్ల మీరు పదేపదే యాప్ ఓపెన్ చేసి, పేరు వెతకాల్సిన అవసరం లేదు.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

NTA UGC NET 2019: యూజీసీ నెట్‌ పాసైతే 5 లాభాలు ఇవే... మార్చి 30 చివరి తేదీ

IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చు

TRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్

Twitter: ట్విట్టర్‌లో పాపులర్ సీఎం ఎవరో తెలుసా?
First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com