హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Whatsapp : 93 లక్ష‌ల భార‌తీయ ఖాతాల‌ను తొల‌గించిన వాట్స‌ప్‌.. కార‌ణం ఇదే!

Whatsapp : 93 లక్ష‌ల భార‌తీయ ఖాతాల‌ను తొల‌గించిన వాట్స‌ప్‌.. కార‌ణం ఇదే!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Whatsapp : ప్ర‌తీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌ (Whatsapp). వినియోగ‌దారుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఈ క్ర‌మంలో జూలై నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 93 ల‌క్ష భార‌తీయ వాట్స‌ప్ ఖాత‌ల‌ను తొల‌గించిన‌ట్టు సంస్త న‌వంబ‌ర్ 1, 2021న ప్ర‌క‌టించింది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించింది.

ఇంకా చదవండి ...

  ప్ర‌తీ స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone)లో ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌ (Whatsapp). వినియోగ‌దారుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తుంది. ఈ క్ర‌మంలో వాట్సాప్ సోమవారం (నవంబర్ 1, 2021) విడుదల చేసిన నివేదిక ప్రకారం, సెప్టెంబర్ నెలలో కంపెనీ 22 లక్షల 9 వేల భారతీయ వాట్స‌ప్‌ ఖాతాల (Indian Whatsapp Accounts)ను నిషేధించింది. వాట్స‌ప్ నెల‌వారీ నివేదిక ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 1, 2021 నుంచి సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు 560 ఫిర్యాదు అందిన‌ట్టు వాట్స‌ప్ తెలిపింది. ఇందులో 309 ఖాతాల‌ను బ్యాన్ చేయాల‌ని కోరారు. ఎకౌంట్ స‌పోర్ట్ కార‌ణాల‌తో 121 ఖాత‌లు, ఇత‌ర కార‌ణాల‌తో 49, స‌పోర్ట్ కార‌ణాల‌తో 49, భ‌ద్ర‌తా ప‌ర‌మైన అంశాల కార‌ణాతో 32 ఖాతాల‌పై ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్టు వాట్స‌ప్ వెల్ల‌డించింది.

  కొత్త చ‌ట్టాల ప్రాతిప‌దిక‌న‌..

  సెప్టెంబర్ నెలలో 51 భారతీయ ఖాతాలను కూడా వేలం వేసినట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ ఖాత‌ను దుర్వినియోగం చేసే విధానాన్ని ఉప‌యోగించి 22 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించింది.

  IRCTC : మీరు ఐఆర్‌సీటీసీ వాడుతున్నారా.. అయితే మీ కోసం ఈ టిప్స్‌


  ఇందులో "రిపోర్ట్" ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారుల నుంచి వచ్చిన ప్రతికూల ఫీడ్‌బ్యాక్ (Feed Back) కారణంగా తీసుకున్న చర్య కూడా ఉంది. మే 26, 2021 నుంచి కొత్త ఐటీ చ‌ట్టాలు అమ‌లులోకి వ‌చ్చాయి. దేశంలోనే పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (Digital Platforms) (5 మిలియన్లకు పైగా వినియోగదారులతో) ప్రతి నెలా సమ్మతి నివేదికలను ప్రచురించాలి. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్ వ‌చ్చిన ఫిర్యాదులు తీసుకొన్న చ‌ర్య‌ల స‌మాచారాన్నిఅందిస్తోంది.

  25శాతం ఇండియ‌న్ ఎకౌంట్లే..

  ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్ల (Accounts)లో 25 శాతం ఇండియాకు చెందిన అకౌంట్లే కావ‌డం విశేషం.. ప్రతీ నెల ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల అకౌంట్లు బ్యాన్ అయితే.. అందులో సుమారు 20 లక్షల అకౌంట్లు ఇండియా నుంచే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.

  JioPhone Next: జియో ఫోన్​ నెక్స్‌ట్ ఎలా ఉంది? ఫోన్‌తో పాటు బాక్సులో ఏమేం వస్తాయి?


  జూన్ 16 నుంచి జూలై 31 వరకు వాట్సప్ 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేయగా..

  ఎందుకు బ్యాన్ చేస్తారు..

  యూజర్ల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ప్రాతిప‌దిక‌న‌ మాత్ర‌మే కాకుండా.. వాట్సప్ లో ఉన్న ఓ టూల్ ఆధారంగా.. హానికరమైన బిహేవియర్ ఉన్న అకౌంట్లను బ్యాన్ చేసింది. అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ ల ద్వారా, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా అకౌంట్లను టూల్ (Tool) గుర్తిస్తుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది యూజర్ రిపోర్ట్ చేసి బ్లాక్ చేసినప్పుడు సంబంధిత అకౌంట్ ను టూల్ అనలైజ్ చేస్తుంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Latest Technology, New IT act, Whatsapp, Whatsapp number

  ఉత్తమ కథలు