Home /News /technology /

WHATSAPP SHOCK FOR INDIAN USERS DELETION OF MILLIONS OF ACCOUNTS KNOW WHY EVK

WhatsApp: ఇండియ‌న్ యూజ‌ర్లుకు వాట్స‌ప్ షాక్.. ల‌క్ష‌ల ఎకౌంట్ల తొల‌గింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp | ఎక్కువ మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్ వాట్స‌ప్‌. భారతీయ యూజ‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం ఒక్క న‌వంబ‌ర్ 2021 నెల‌లో 17 లక్షల 59 వేల అకౌంట్లను నిషేధించిన‌ట్టు తెలిపింది. అస‌లు వాట్స‌ప్ ఈ ఖాతాల‌ను ఎందుకు నిషేధించిందో తెలుసుకోండి. మీరు జాగ్ర‌త్త ప‌డండి.

ఇంకా చదవండి ...
    ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాట్సాప్​ను ప్రతిరోజూ వాడుతుంటారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్​ (WhatsApp) తో సహవాసం చేస్తుంటారు. ఒక్క రోజు వాట్సాప్​ సేవలు నిలిచిపోయినా ఎంతో ఫీలవుతుంటారు. ఈ స్థాయిలో ప్రజల జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్ అకౌంట్ (Account) బ్యాన్​ అయితే.. ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇలాంటి చేదు అనుభవం ఇటీవల కొంత మంది యూజర్ల (Users)కు ఎదురైంది. గ‌తేడాది వ‌రుస‌గా సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ నెల‌లో భారీగా యూజ‌ర్ల‌ను తొల‌గించింది వాట్స‌ప్ ఈ విష‌యం సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 2021 నెల‌లో 17 లక్షల 59 వేల అకౌంట్లను నిషేధించింది వాట్సాప్​. అక్టోబర్​ నెలలో 20 లక్షల 69 వేల అకౌంట్ఉల‌నిషేధించింది వాట్సాప్​.

    యూజర్లు తమ “సేవా నిబంధనలను” ఉల్లంఘించినట్లు కనుగొంటే, ఖాతాలను నిషేధిస్తామని స్పష్టంగా పేర్కొంది. వాట్సాప్​ “సర్వీస్ నిబంధనల” (Service Rules) ప్రకారం, ఈ 8 పనులను చేయడం వల్ల ఖాతాలు బ్యాన్​ అయ్యే అవకాశం ఉంద‌ని వాట్స‌ప్ తెలిపింది. అవేంటో తెలుసుకోండి.

    కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తికి ఎక్కువ మెసేజ్‌లు పంపడం
    మీ వాట్సాప్​ కాంటాక్ట్ లిస్ట్​లో లేని నంబర్​కు పదే పదే మెసేజ్​లు పంపడం వల్ల కూడా వాట్సాప్​ అకౌంట్ బ్యాన్​ అయ్యే ప్రమాదం ఉంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులను స్పామ్ చేస్తే, వాట్సాప్​ మీ ఖాతాను నిషేధిస్తుంది. అంతేకాదు, బల్క్ మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ వంటివి చేస్తే వాట్సాప్​ చర్యలు తీసుకుంటుంది.

    COVID 19 Vaccine: పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు.. రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ తెలుసుకోండి! 


    వాట్సాప్​ డెల్టా, జీబీ వాట్సాప్​, వాట్సాప్​ ప్లస్​ వంటి థర్డ్​ పార్టీ యాప్స్​ ఉపయోగించడం
    కొంత మంది వాట్సాప్​ థర్డ్​ పార్టీ యాప్స్​ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్స్​ ద్వారా ఇతరుల వాట్సాప్​ అకౌంట్లను హ్యాక్​ చేసి వారి చాటింగ్ హిస్టరీని తెలుసుకుంటున్నారు. ఇది వ్యక్తిగత గోప్యత (Privacy)కు వ్యతిరేకం. కాబట్టి, వాట్సాప్​ ఆయా అకౌంట్లను బ్యాన్​ చేస్తుంది.

    ఎక్కువ మంది యూజర్లు మీ అకౌంట్​ను బ్లాక్​ చేయడం
    వివిధ కారణాలతో మీ స్నేహితులు లేదా తెలిసిన వారు మీ అకౌంట్​ను బ్లాక్​ చేస్తుంటారు. అయితే, ఇలా ఎక్కువ మంది మీ అకౌంట్​ను బ్లాక్​ చేస్తే, ఆ వ్యక్తులు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా వాట్సాప్​ మిమ్మల్ని నిషేధించవచ్చు.

    మీ వాట్సాప్​ ఖాతాకు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేయడం
    మీ వాట్సాప్​ ఖాతాకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తే వాట్సాప్​ మీ అకౌంట్​పై బ్యాన్​ విధించే అవకాశం ఉంది.

    Uttar Pradesh: యూపీ పీఠం ఎవ‌రిదంటే.. తాజా స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు!


    ఇతర యూజర్లకు మాల్వేర్ లేదా ఫిషింగ్ లింక్‌లను పంపించడం
    మీ ఆండ్రాయిడ్​ ఫోన్‌ నుంచి APK ఫైల్‌ల రూపంలో మాల్వేర్‌ను పంపితే లేదా ప్రమాదకరమైన ఫిషింగ్ లింక్స్​ను యూజర్లకు ఫార్వర్డ్ చేస్తే, వాట్సాప్​ మీ అకౌంట్​పై బ్యాన్​ విధించే అవకాశం ఉంది.

    వాట్సాప్​లో పోర్న్ క్లిప్‌లు, పరువు నష్టం కలిగించే మెసేజ్​లు పంపించడం
    మీ వాట్సాప్​ నుంచి ఇతరులకు చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన, పరువు నష్టం కలిగించే, వేధించడం, ద్వేషపూరిత సందేశాలు పంపిస్తే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.

    మరొకరి పేరుతో నకిలీ ఖాతాను సృష్టించడం
    వాట్సాప్‌లో కొంత మంది మరొకరి పేరుతో నకిలీ ఖాతా (Fake Account) లను సృష్టిస్తున్నారు, దీని ద్వారా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసిన వారి అకౌంట్లను గుర్తించి బ్యాన్ ​చేస్తుంది.

    2021 నవంబర్‌లో సుమారు 602 ఖాతాలపై ఫిర్యా దులు అం దగా, వాటిలో 149 ఖాతాలు సహాయం కోసం , 357 ఖాతాలపై బ్యా న్ అప్పీ ల్, 48 ఖాతాలు ప్రొడక్ట్ సపోర్ట్ కోసం , 27 ఖాతాలపై భద్రతపరమైన చర్యలకు సం బం ధిం చి వినతులు అం దినట్లు వాట్సాప్ రిపోర్టులో వెల్లడిం చిం ది. భారత ఐటీ నిబం ధనల ప్రకారం 5 మిలియన్ యూజర్స్ ఉన్న ప్రతి కం పెనీ నెలవారీ రిపోర్ట్ను పబ్లిష్ చేయడం తోపాటు
    యూజర్స్ నుం చి వచ్చే ఫిర్యా దులపై ఎలాం టి చర్యలు తీసుకున్నా రనే వివరాలను అం దులో పొం దుపరచాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cyber security, Latest Technology, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు