WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

ఈ రోజుల్లో విండోస్ ఫోన్ వాడుతున్నవాళ్లు చాలా అరుదు. ఒకవేళ మీ దగ్గర కూడా విండోస్ ఫోన్ ఉన్నట్టైతే వాట్సప్ డిసెంబర్ 31 వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత వాట్సప్ కావాలంటే కొత్త ఫోన్ ఉపయోగించాల్సిందే.

news18-telugu
Updated: May 9, 2019, 4:09 PM IST
WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్. కోట్లాది మంది ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి వాట్సప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు యూజర్లకు ఇది బ్యాడ్ న్యూసే. 2019 డిసెంబర్ 31 వరకే విండోస్ ఫోన్లల్లో వాట్సప్ పనిచేస్తుంది. విండోస్ ఫోన్‌కు వాట్సప్ చివరి అప్‌డేట్ జూన్‌లో రానుంది. ఆ తర్వాత 2020 జనవరి 1 నుంచి విండోస్ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు. ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్తకొత్త అప్‌డేట్స్ చేస్తుండటం, ఫీచర్స్ మారుస్తుండటంతో పాత ఫోన్లల్లో యాప్ సరిగ్గా పనిచేయట్లేదు. దీంతో వాటికి వాట్సప్ సేవల్ని శాశ్వతంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. అందులో భాగంగానే దశల వారీగా పాత ఫోన్లల్లో వాట్సప్ సేవల్ని నిలిపేస్తోంది. ఈ రోజుల్లో విండోస్ ఫోన్ వాడుతున్నవాళ్లు చాలా అరుదు. ఒకవేళ మీ దగ్గర కూడా విండోస్ ఫోన్ ఉన్నట్టైతే వాట్సప్ డిసెంబర్ 31 వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత వాట్సప్ కావాలంటే కొత్త ఫోన్ ఉపయోగించాల్సిందే.

Read this: WhatsApp New Features: వాట్సప్‌లో 12 కొత్త ఫీచర్స్... ట్రై చేశారా

విండోస్ ఫోన్లు మాత్రమే కాదు... ఆండ్రాయిడ్ 2.3.7 అంతకంటే ముందు వర్షన్లు, iOS 7 అంతకంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. పాత మోడల్స్ ఫోన్లల్లో వాట్సప్ ఆపెయ్యడం ఇదే కొత్త కాదు. 2017 జూన్‌లో నోకియా సింబియాన్ ఎస్60, అదే ఏడాది డిసెంబర్ నుంచి బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్‌బెర్రీ ఓఎస్, 2018 డిసెంబర్ నుంచి నోకియా సింబియాన్ ఎస్60 ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్‌... ఇలా యాక్టివేట్ చేసుకోండిATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...
First published: May 9, 2019, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading