హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్‌తో మీ వాట్సప్ సేఫ్... వెంటనే మార్చేయండి

WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్‌తో మీ వాట్సప్ సేఫ్... వెంటనే మార్చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp | మీ వాట్సప్ హ్యాక్ అయిందని డౌట్‌గా ఉందా? మీ వాట్సప్ ఫైల్స్ ఇతరులు చూస్తున్నారని అనుమానంగా ఉందా? అయితే వెంటనే ఈ రెండు సెట్టింగ్స్ మార్చేయండి. మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించండి.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ గురించి పరిచయం అక్కర్లేదు. మొదట వాట్సప్ ఛాటింగ్ కోసం మాత్రమే ఉపయోగపడేది. తర్వాత ఫైల్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్లీ ఛాటింగ్ మాత్రమే కాదు... అఫీషియల్ డిస్కషన్స్ కూడా వాట్సప్‌లో జరిగిపోతున్నాయి. వాట్సప్‌లో మెసేజెస్ పంపడం మాత్రమే కాదు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ కూడా షేర్ చేయొచ్చు. ముఖ్యమైన ఫైల్స్‌ని కూడా వాట్సప్‌లో షేర్ చేస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్‌ ఇతరుల చేతుల్లోకి వెళ్తే వాట్సప్ ఓపెన్ చేసి ఫైల్స్ చూడటం పెద్ద కష్టమేమీ కాదు. వాట్సప్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. కానీ అవి డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉండవు. యూజర్లు వాటిని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

UPI Transaction: గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్

వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించాలంటే సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేయడం అవసరం. వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ లాక్‌తో పాటు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ఉపయోగిస్తే మీ వాట్సప్ సేఫే. వాట్సప్‌లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేయడానికి ముందుగా యాప్ ఓపెన్ చేయాలి. రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. తర్వాత అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులో Two-step-verification పైన క్లిక్ చేయాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ ఓపెన్ చేసి ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాలి. ఆ పిన్ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇక ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేయాలన్నా, వాట్సప్ ఇన్‌స్టాల్ చేయాలన్నా టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఒకవేళ మీ వాట్సప్ ఎవరైనా హ్యాక్ చేసినా ఈ పిన్ లేకుండా యాప్ మాత్రం ఓపెన్ కాదు.

Jio New Year Gift: యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన జియో... ఏంటో తెలుసుకోండి

IRCTC: రైల్వే ప్రయాణికులకు న్యూ ఇయర్ గిఫ్ట్... ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్స్

ఇక వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ముందుగా యాప్ ఓపెన్ చేయాలి. రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. తర్వాత అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులో ప్రైవసీ పైన క్లిక్ చేయాలి. చివర్లో Fingerprint Lock ఉంటుంది. ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత మీ వాట్సప్ ఓపెన్ చేయడానికి మీ వేలిముద్ర తప్పనిసరిగా కావాలి. ఈ రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేశారంటే మీ వాట్సప్ ఇతరులు ఓపెన్ చేసి చూడటం సాధ్యం కాదు. మీ ఛాట్స్, ఫోటోలు, వీడియోలు అన్నీ సురక్షితంగానే ఉంటాయి.

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు