'1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితం'... ఈ మెసేజ్ నమ్మితే మోసపోవాల్సిందే

WhatsApp 1000 GB Data Scam | ఇలాంటి ఆఫర్లు ఏవైనా ఉన్నట్టు మీకు మెసేజ్ వస్తే, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో క్రాస్ చెక్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET పరిశోధకులు చెబుతున్నారు.

news18-telugu
Updated: July 30, 2019, 4:50 PM IST
'1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితం'... ఈ మెసేజ్ నమ్మితే మోసపోవాల్సిందే
'1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితం'... ఈ మెసేజ్ నమ్మితే మోసపోవాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా యూజర్లకు 1000 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా ఇస్తోందన్న మెసేజ్ మీ వాట్సప్‌కు వచ్చిందా? అయితే జాగ్రత్త. ఆ మెసేజ్‌ను నమ్మితే మోసపోవాల్సిందే. ఇది చాలా వేగంగా విస్తరిస్తున్న స్కామ్. మీకు వాట్సప్‌లో వచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే వరుసగా ప్రశ్నలు ఉంటాయి. వాటికి జవాబులు చెప్తూ వెళ్తే మరో 30 మందికి ఇదే మెసేజ్‌ను పంపాలని, అప్పుడే పెద్ద రివార్డ్ గెల్చుకుంటారని చివర్లో తేలిపోతుంది. అసలు వాట్సప్ నుంచి ఇలాంటి ఫ్రీ ఆఫర్లేమీ లేవు. మీ డేటా కాజేసేందుకు, ప్రమోషన్స్ నిర్వహించేందుకు కొన్ని నకిలీ వెబ్‌సైట్లు మిమ్మల్ని వలలో వేసుకుంటున్నాయి. వీటిని నమ్మితే మీ టైమ్ వేస్ట్ కావడంతో పాటు మీ డేటాకు ముప్పు తప్పదు. అసలు ఇలాంటి ఆఫర్లు ఏవైనా ఉన్నట్టు మీకు మెసేజ్ వస్తే, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో క్రాస్ చెక్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET పరిశోధకులు చెబుతున్నారు.

ఒక్క వాట్సప్ మాత్రమే కాదు... పెద్దపెద్ద బ్రాండ్స్ పేరు చెప్పుకొని అమాయకుల్ని బుక్ చేస్తున్నాయి వెబ్‌సైట్లు. గతంలోనూ ఇలాంటి స్కామ్‌లు బయటపడ్డాయి. Adidas, Nestle, Rolex లాంటి పెద్ద కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు సర్క్యులేట్ చేసి ప్రమోషన్ నిర్వహిస్తున్నాయి థర్డ్ పార్టీ ఏజెన్సీలు. 2017 లో కూడా ఇలాగే ఫ్రీ ఇంటర్నెట్ పేరుతో వాట్సప్‌లో మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. అప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేశారు యూజర్లు. ఎంత చేసినా ఫ్రీ డేటా రాలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి మెసేజ్ చక్కర్లు కొడుతోంది. వాట్సప్ ఏకంగా 1000 జీబీ డేటా ఫ్రీగా ఇస్తుందన్న మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటివి నమ్మారంటే మోసపోవాల్సిందే. అందుకే బీ అలర్ట్.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...
ఇవి కూడా చదవండి:

Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి

LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలుCredit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు