WHATSAPP SAYS COMMITTED TO PRIVACY AND PUSH BACK PRIVACY POLICY TILL MAY 15TH BA
WhatsApp Privacy Policy: దెబ్బకు దిగొచ్చిన వాట్సప్.. ప్రైవసీ పాలసీపై తాజా ప్రకటన
WhatsApp (ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ దెబ్బకు దిగొచ్చింది. భారత ప్రభుత్వం ఒత్తిడి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన క్రమంలో ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత దేశ ప్రజల ప్రైవసీని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ దెబ్బకు దిగొచ్చింది. భారత ప్రభుత్వం ఒత్తిడి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన క్రమంలో ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత దేశ ప్రజల ప్రైవసీని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్ ముందుకు వెళ్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేవలం కొన్ని గంటల్లోనే వాట్సాప్ ప్రకటన జారీ చేసింది. ‘కొంత తప్పుడు సమాచారం, మా యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మా ప్రైవసీ పాలసీ కి ఆమోదం తెలిపే గడువును మే 15 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పింది. ఈ లోపు మేం ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉన్నాం.’ అని వాట్సాప్ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతకు ముందు తాము కొత్త ప్రైవసీ పాలసీతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపింది. దీంతో వాట్సాప్ యూజర్లు దానికి గుడ్ బై కొట్టి టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి సంస్థలకు మళ్లారు. వాట్సాప్‌ను అన్ ఇన్ స్టాల్ చేశారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ డౌన్ లోడ్స్ విపరీతంగా పెరిగాయి.
తమకు ఎదురవుతున్న అన్ని ప్రశ్నలకు, సందేహాలను నివృత్తి చేసేందుకు తాము మరింత సమాచారాన్ని అందుబాటులో ఉంచామని తెలిపింది. కొత్త కొత్త అప్ డేట్స్ మీద సమీక్ష చేసి యాక్సెప్ట్ చేసేలా తాము యూజర్లను కోరుతున్నట్టు చెప్పింది. చాట్‌లో కొత్త ప్రక్రియలను అందుబాటులోకి తెస్తున్నామని, అలాగే వాట్సాప్ బిజినెస్‌లో కూడా షాపింగ్ చేయడానికి సంబంధించిన అప్ డేట్స్ అన్నీ కూడా ఆప్షనల్ అని పేర్కొంది. పర్సనల్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ అయి ఉంటాయని తెలిపింది. కాబట్టి, వాట్సాప్ ఎవరి చాట్స్‌ను చదివే, వినే అవకాశం లేదని స్పష్టం చేసింది.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా సందేశ్ యాప్
వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను పరీక్షిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సందేశ్ యాప్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఇన్స్టంట్ మెసేజింగ్ సిస్టమ్ (GIMS)ను అప్‌గ్రేడ్ చేసి సందేశ్ యాప్‌ను రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో పాటు వ్యక్తిగత వినియోగదారులకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇతర మెసేజింగ్ యాప్‌ల మాదిరిగానే సందేశ్ యాప్‌లో చాట్ లిస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపవచ్చు. గ్రూప్ చాట్, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మల్టీమీడియా కంటెంట్‌తో పాటు కాంటాక్ట్స్ షేరింగ్ ఆప్షన్ కూడా ఈ యాప్‌లో ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు GIMS పోర్టల్ ద్వారా సందేశ్ యాప్ APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ 5.0, ఆ తరువాత వచ్చిన ఆండ్రాయిడ్ డివైజ్‌లలో పనిచేస్తుంది. iOS వినియోగదారులు నేరుగా యాప్ స్టోర్‌లో సందేశ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. iOS 12.0తో పనిచేసే ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్.. వంటి డివైజ్‌లలో ఈ యాప్ పనిచేస్తుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.