హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త వీడియో మోడ్‌.. ఇప్పుడు వీడియో రికార్డింగ్ సులభం

WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త వీడియో మోడ్‌.. ఇప్పుడు వీడియో రికార్డింగ్ సులభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లు అందించటంలో ముందుండే వాట్సాప్‌ తాజా అప్‌డేట్‌తో కొత్త వీడియో మోడ్‌ను తీసుకొచ్చింది. ఇకపై వీడియో రికార్డు చేయాలంటే వీడియో రికార్డింగ్ బటన్‌ను అలా పట్టుకుని ఉండాల్సిన అవసరం ఉండదని వాట్సాప్‌ తెలిపింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లు అందించటంలో ముందుండే వాట్సాప్‌ తాజా అప్‌డేట్‌తో కొత్త వీడియో మోడ్‌ను తీసుకొచ్చింది. ఇకపై వీడియో రికార్డు చేయాలంటే వీడియో రికార్డింగ్ బటన్‌ను అలా పట్టుకుని ఉండాల్సిన అవసరం ఉండదని వాట్సాప్‌ తెలిపింది. Android 2.23.2.73 అప్‌డేట్‌లో WhatsAppలో కొత్త వీడియో మోడ్‌ను చేర్చింది. వీడియోలను ఈజీగా రికార్డు చేసేందుకు ఈ మోడ్ ఉపయోగపడుతుందని వాట్సాప్‌ తెలిపింది.

పాత వెర్షన్ వాట్సాప్ యూజర్లు వీడియో రికార్డు చేయాలంటే కచ్చితంగా కెమెరా బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. ఎందుకంటే పాత వెర్షన్లలో కెమెరా, వీడియో కోసం ఒకే బటన్ అందుబాటులో ఉంది. కానీ కొత్త అప్‌డేట్‌తో వచ్చే న్యూ ఫీచర్‌తో ఫోటో కోసం, వీడియో కోసం స్పెషల్ బటన్స్ ఉంటాయి. దీంతో వీడియో మోడ్‌ ఆన్ చేసి సింపుల్‌గా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే దీంతో మరింత సౌలభ్యంతో వీడియోను రికార్డు చేసుకోవచ్చని వాట్సాప్‌ వివరించింది.

కొత్త వెర్షన్ - కొత్త అప్‌డేట్‌

యూజర్లకు వీడియో రికార్డింగ్‌ను మరింత సౌకర్యంగా మార్చే కొత్త మోడ్‌ Android 2.23.2.73 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను Google Play Storeలో విడుదల చేశామని వాట్సాప్‌‌ ప్రకటించింది. కొత్త ఫీచర్‌ను ఓ సారి ట్రై చేయాలనుకున్నవాళ్లు తమ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లో దీన్ని అప్‌డేట్‌ చేసుకోవచ్చని, దీని కోసం ప్లే స్టోర్‌కి వెళ్తే సరిపోతుందని వాట్సాప్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ని ఉపయోగించి యూజర్‌ తన అభిప్రాయాలను తెలపాలని కోరింది.

* బగ్ సొల్యూషన్స్

తాజా అప్‌డేట్‌ వెర్షన్ కంటే ముందు విడుదల చేసిన 2.23.2 బీటా బిల్డ్ పనితీరును కూడా మెరుగుపర్చినట్లు వాట్సాప్‌ ప్రకటించింది. తాజా అప్‌డేట్‌లో బీటా బిల్డ్‌కు సంబంధించిన బగ్ సొల్యూషన్లు, వర్కింగ్ ఇంప్రోవ్‌మెంట్స్‌ చేసినట్లుగా స్పష్టం చేసింది. ప్రీవియస్‌ వెర్షన్‌ సమస్యలను యూజర్లు ఎదుర్కొంటుంటే తాజా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే పరిష్కారాలు లభిస్తాయని ప్రకటించింది.

* ఐఫోన్ యూజర్ల కోసం

iPhone యూజర్లకు వాట్సాప్ కొత్త అప్‌డేట్స్ ఇవ్వనుంది. కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్‌ గ్రూప్‌లోని మెసేజ్‌లకు రెస్పాండ్‌ అయ్యే సామర్థ్యంపై WhatsApp కృషి చేస్తోంది. iOS 23.2.0.75 అప్‌డేట్ కోసం రూపొందించిన WhatsApp బీటాలో రెస్పాండింగ్‌ ఫీచర్‌ను గుర్తించినట్లుగానే అనౌన్స్‌మెంట్ గ్రూప్‌లోని మెసేజ్‌ రియాక్షన్ల గురించి యూజర్లకు తెలియజేసేందుకు యాప్‌లోనే బ్యానర్‌ రూపంలో ప్రకటన ఇస్తామని తెలిపింది.

Oppo Reno 8T: ఫిబ్రవరి 3న ఒప్పొ రెనో 8T స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Amazon-Flipkart Offers: వేసవి కంటే ముందు.. రూ.25వేల తగ్గింపుతో రిఫ్రిజిరేటర్లు..

* కొత్త ఫాంట్స్‌పై పని చేస్తున్న వాట్సాప్‌‌

నిత్యం కొత్త ఫీచర్లు అందించాలని ఆరాటపడే WhatsApp ఇప్పుడు మరికొన్ని కొత్త ఫీచర్లపై పని చేస్తోంది. Android 2.23.3.7 అప్‌డేట్‌పై ఇప్పటివరకూ పని చేసిన ఈ సంస్థ భవిష్యత్తులో విడుదల చేయబోయే కొత్త ఫాంట్‌లపై పని చేస్తోంది. వీటిలో కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ ఉన్నాయి. ఈ ఫాంట్‌లను వినియోగించుకోవటం ద్వారా యూజర్లు తమ ఇమేజ్‌లు, వీడియోలు, GIFలను ఆకర్షణీయంగా తయారు చేయవచ్చని తెలిపింది. చెప్పాలనుకున్న విషయాన్ని విజువల్‌ రూపంలో ఆకర్షణీయంగా రూపొందించేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపింది.

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు