WhatsApp : ప్రపంచంలోనే ఎక్కువ శాతం మంది యూజర్లను ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్(WhatsApp) సొంతం చేసుకుంది. సెక్యూరిటీ, ప్రైవసీ, పర్ఫార్మెన్స్ విభాగాలను మరింత మెరుగు పరుస్తూ లేటెస్ట్ ఫీచర్ల ద్వారా యూజర్లను ఆకట్టుకుంటోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త బీటా అప్‌డేట్ అందించింది. బగ్ ఫ్రీ వాట్సాప్ బీటా 2.23.7.14 అప్‌డేట్‌ను విడుదల చేసింది. మునుపటి వెర్షన్‌లో కనిపించిన బగ్‌లకు ఇందులో పరిష్కారాలు అందించింది. ముఖ్యంగా వాట్సాప్ ఎక్స్‌పైరేషన్(Expiration) సమస్యను దూరం చేసింది.
వాట్సాప్ వినియోగదారులు ఎల్లప్పుడూ అప్లికేషన్ లేటెస్ట్, అప్‌డేటెడ్ వెర్షన్‌ను వినియోగించాలి. పాత వెర్షన్‌లపై వినియోగదారులను అలర్ట్ చేసేందుకు, కొత్త వెర్షన్‌కు మారేందుకు వాట్సాప్ ఎక్స్‌పైర్ అవుతుంది. వినియోగదారులు వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను వినియోగించడం చాలా అవసరం. ఎందుకంటే అంతకు ముందు వెర్షన్‌లలో బయటపడిన ప్రైవసీ, సెక్యూరిటీ బగ్‌లకు పరిష్కారం లభిస్తుంది. అంతే కాకుండా మెరుగైన ఫీచర్‌లతో మరింత సెక్యూరిటీ పెరుగుతుంది. హ్యాకింగ్, ఫిషింగ్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి. లేటెస్ట్ ఆప్షన్‌లు కూడా అప్‌డేటెడ్ వెర్షన్ ద్వారా లభిస్తాయి.
* బయటపడిన బగ్
వాట్సాప్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo నివేదిక ప్రకారం..‘వాట్సాప్ అప్లికేషన్ పాత వెర్షన్‌లు ఎక్స్‌పైర్ అయిపోతే, వినియోగదారులు కచ్చితంగా మరింత సురక్షితమైన, లేటెస్ట్‌గా వచ్చిన వాట్సాప్ వెర్షన్‌కి మారుతారు. అయితే ఇటీవల కొన్ని యాప్ బీటా వెర్షన్‌లలో ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. వాట్సాప్ ఊహించిన దాని కంటే ముందుగానే ఎక్స్‌పైర్ అవుతోంది.’ అని పేర్కొంది.
Whatsapp: వాట్సాప్ నుంచి ఆడియో చాట్ ఫీచర్.. త్వరలో లాంచ్.. వివరాలివే..
* అకస్మాత్తుగా ఎక్స్‌పైర్ అయిన వాట్సాప్
కొంతమంది వాట్సాప్ అప్లికేషన్ ఎక్స్‌పైర్ కావడంతో వినియోగదారులు దానిని ఉపయోగించలేకపోయారు. వాస్తవానికి ఎక్స్‌పైర్ అవ్వడానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉంది. కానీ బగ్ కారణంగా అకస్మాత్తుగా వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. ప్లే స్టోర్‌లో విడుదలైన కొన్ని రోజుల తర్వాత వాట్సాప్ పని చేయడం ఆగిపోయింది. యాప్‌ను అకస్మాత్తుగా యాక్సెస్ చేయలేకపోయిన కొంతమంది వినియోగదారులకు బగ్ గణనీయమైన అంతరాయం కలిగించింది.
* వాట్సాప్ అధికారిక సైట్‌లో బగ్ ఫ్రీ వెర్షన్
ఇప్పుడు వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.23.7.14 అప్‌డేట్, అధికారిక వాట్సాప్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో బగ్‌కు కంపెనీ పరిష్కారం చూపింది. ఈ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారికి ఎక్స్‌పైర్ అయ్యే సమస్య ఉండదు. వాట్సాప్ బగ్-ఫ్రీ వెర్షన్‌ను ఉపయోగించడానికి అధికారిక వాట్సాప్ వెబ్‌సైట్‌ని సంప్రదించాలి. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అదే సమస్యను ఎదుర్కొంటే, యాప్‌ను ఫోర్స్ క్లోజ్ చేయాలని WABetaInfo సూచించింది. అయితే బీటా వెర్షన్ వాడకంతో కొత్త ఫీచర్లు ఎక్స్‌పీరియన్స్ చేసినా, దీంట్లో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఈ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Whatsapp