WHATSAPP ROLLS OUT JOINABLE CALLS FEATURE TO JOIN MISSED GROUP CALLS KNOW HOW THIS FEATURE WORKS SS
WhatsApp New Feature: వాట్సప్‌లో గ్రూప్ కాల్స్‌లో కొత్త ఫీచర్... మీరూ వాడుకోండి ఇలా
WhatsApp New Feature: వాట్సప్‌లో గ్రూప్ కాల్స్‌లో కొత్త ఫీచర్... మీరూ వాడుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp New Feature | వాట్సప్ యూజర్లకు శుభవార్త. వాట్సప్ నుంచి జాయినబుల్ కాల్స్ (joinable calls) ఫీచర్ వచ్చేసింది. గ్రూప్ కాల్స్‌లో చేరడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
వాట్సప్‌లో మీకు వీడియో కాల్ వచ్చినప్పుడు మీరు బిజీగా ఉంటే తర్వాత కాల్ చేద్దామని పట్టించుకోరు. వాట్సప్ ఛాట్‌లో మిస్డ్ కాల్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. వీడియో కాల్ లేదా వాయిస్ కాల్స్ చేయొచ్చు. ఒకవేళ మీకు గ్రూప్ కాల్ (Group Call) వచ్చినప్పుడు మీరు బిజీగా ఉంటే కాల్ లిఫ్ట్ చేయలేదనుకోండి... ఆ తర్వాత పరిస్థితి ఏంటీ? మళ్లీ గ్రూప్ కాల్లో జాయిన్ కావడం సాధ్యం కాదు. ఈ సమస్యను గుర్తించిన వాట్సప్ అద్భుతమైన ఫీచర్ (WhatsApp Feature) రిలీజ్ చేసింది. గ్రూప్ ఛాట్స్‌లో వచ్చే కాల్స్‌ని మీరు మిస్ అయితే ఆ తర్వాత జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం జాయినబుల్ కాల్స్ (joinable calls) రిలీజ్ చేసింది. ఇకపై మీరు గ్రూప్ కాల్స్ మిస్ అయినట్టైతే కేవలం ఒక్క క్లిక్‌తో ఆ గ్రూప్ కాల్లో చేరొచ్చు.
వాట్సప్ గ్రూప్ కాల్స్‌లో చేరే ఫీచర్‌ను కొంతకాలంగా పరీక్షిస్తోంది వాట్సప్. మొదట బీటా యూజర్లు ఈ ఫీచర్‌ను పరీక్షించారు. ఈ ఫీచర్ విజయవంతం కావడంతో యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. గ్రూప్ ఛాట్స్‌లో ఆన్‌గోయింగ్ కాల్స్‌లో ఈజీగా జాయిన్ కావొచ్చని వాట్సప్ ట్వీట్ చేసింది. మీకు ఏ గ్రూప్ నుంచి కాల్ వచ్చిందో నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే గ్రూప్ కాల్లో చేరొచ్చు.
ఇదొక్కటే కాదు... మరిన్ని అద్భుతమైన ఫీచర్స్‌ని వాట్సప్ రూపొందిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీ కోసం గూగుల్ డ్రైవ్‌లో, ఐఓఎస్ యూజర్ల కోసం ఐక్లౌడ్‌లో బ్యాకప్స్‌కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను జోడించింది. ఇక వాయిస్ మెసేజెస్‌లో కూడా మరిన్ని ఫీచర్స్ తీసుకురాబోతోంది. దీంతో పాటు డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్లో యూజర్లకు 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజుల ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించనుంది.
మరోవైపు వాట్సప్‌లో ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ కూడా రాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఫేస్బుక్ మెసెంజర్‌తో పాటు ఇతర ఛాటింగ్ యాప్స్‌లో ఉంది. ఒక మెసేజ్‌కు మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేవలం రియాక్ట్ అవ్వొచ్చు. గ్రూప్ ఛాట్స్‌లో ఈ ఫీచర్ బాగా ఉపయోపడనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నారు.
మీరు వాట్సప్ బీటా యూజర్ అయితే 2.21.210.15 వర్షన్ అప్డేట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. మీకు ఎవరైనా వాట్సప్‌లో మెసేజ్ చేస్తే ఎమోజీ ద్వారా రియాక్ట్ కావొచ్చు. గ్రూప్ ఛాట్స్‌లో కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.