• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • WHATSAPP ROLLS OUT IN APP NOTIFICATIONS FEATURE IN INDIA KNOW HOW TO CHANGE SETTINGS AND HOW IT WORKS SS GH

WhatsApp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇలా వాడుకోవచ్చు

WhatsApp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇలా వాడుకోవచ్చు

WhatsApp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇలా వాడుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp New Features | మీరు వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నారా? కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంది. దీనిలో భాగంగా నూతన నోటిఫికేషన్లను పొందడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు యాప్ తెరిచినప్పుడు రెండు వేర్వేరు పద్ధతుల్లో అలర్ట్స్ లేదా ఇతర నోటిఫికేషన్‌లు పొందుతారు. కాగా, iOS వెర్షన్ ఉన్న వినియోగదారులకు ఇన్ -యాప్ నోటిఫికేషన్‌ ఫీచర్ ఇదివరకే అందుబాటులో ఉంది. కాగా, ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

Vivo Y51: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో వివో వై51 రిలీజ్

Moto G 5G: రూ.6,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

ఫిబ్రవరిలో నూతన ఫీచర్ అందుబాటులోకి...


భారతదేశంలోని iOS వినియోగదారులు ఈ ఫీచర్ను పొందాలంటే వాట్సాప్ యాప్లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి, నోటిఫికేషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో ఉండే ఇన్–యాప్ నోటిఫికేషన్ను సెలెక్ట్ చేసుకుంటే వినియోగదారులు మొత్తం మూడు అలర్ట్ స్టైల్ లను పొందవచ్చు. వీటిలో None, Banners, Alerts అనే 3 అలర్ట్ స్టైల్స్ ఉంటాయి. బ్యానర్లు ఆప్షన్ను ఎంచుకుంటే మీ వాట్సాప్‌కు వచ్చే మెసేజెస్ను స్క్రీన్ పైభాగంలో నోటిఫికేషన్ల రూపంలో పొందవచ్చు. కాగా, ఈ నోటిఫికేషన్లు ఆటోమెటిక్‌గా వెళ్లిపోతాయని వాట్సాప్ వివరించింది. వినియోగదారుడు ఒకవేళ, అలర్ట్స్ ఆప్షన్‌ను ఎంచుకుంటే అక్కడికక్కడే మెసేజ్ చేసే అవకాశం లభిస్తుంది.

IRCTC PNR Status: మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

WhatsApp New Features: వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

అదేవిధంగా, నన్ లేదా ఏదీ కాదు ఆప్షన్ను ఎంపిక చేసుకుంటే, వినియోగదారులు ఎటువంటి నోటిఫికేషన్లను పొందలేరు. నన్ లేదా ఏదీకాదు ఆప్షన్ తప్ప మిగతా రెండు ఆప్షన్లలో దేన్ని ఎంపిక చేసుకున్నా సరే, వారు సౌండ్, వైబ్రేట్ ఆప్షన్లను పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్ టెలిగ్రామ్ యాప్ వలే పనిచేస్తుందని వాట్సాప్ తెలిపింది. అంతేకాక, దీనిలో ప్రత్యేక చాట్‌బాట్‌ ఆప్షన్ కూడా లభిస్తుందని పేర్కొంది. ఈ నూతన ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారనే విషయంపై వాట్సాప్ ఇంకా అధికారికంగా ఎటువంటి స్పష్టతనివ్వనప్పటికీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని WABetaInfo పేర్కొంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు