హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. క్యాప్షన్‌తో ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్‌ చేసే అవకాశం..

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. క్యాప్షన్‌తో ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్‌ చేసే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో ​టాప్​ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతున్న వాట్సాప్​.. ఇప్పుడు​ iOS యూజర్లపై దృష్టి పెట్టింది. తాజాగా ఐఫోన్​ యూజర్లను ఆకట్టుకునేందుకు క్యాప్షన్‌తో మీడియా ఫైల్స్‌ ఫార్వర్డ్‌ చేసే ఆప్షన్‌గలాంచ్‌ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టాంట్‌ ​ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ యూజర్లతో వాట్సాప్​ దూసుకుపోతోంది. కొత్త యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరుస్తోంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో ​టాప్​ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతున్న వాట్సాప్​.. ఇప్పుడు​ iOS యూజర్లపై దృష్టి పెట్టింది. తాజాగా ఐఫోన్​ యూజర్లను ఆకట్టుకునేందుకు క్యాప్షన్‌తో మీడియా ఫైల్స్‌ ఫార్వర్డ్‌ చేసే ఆప్షన్‌గలాంచ్‌ చేసింది. ఈ లేటెస్ట్‌ ఫీచర్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్షన్‌తో పాటు మీడియా షేరింగ్‌

క్యాప్షన్‌తో పాటుగా మీడియా ఫైల్స్‌ షేర్‌ చేసే ఫీచర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వీడియోలు, ఇమేజెస్‌, GIFలు, డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేయవచ్చు. అంతేకాకుండా యూజర్లు క్యాప్షన్‌ను తొలగించేందుకు సైతం ఈ ఫీచర్​ అనుమతిస్తుంది. ఇప్పటివరకు వాట్సాప్‍లో రిసీవ్ చేసుకున్న ఏదైనా ఫొటో కానీ, వీడియోను కానీ ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే.. దానికి ఉండే క్యాప్షన్ సెండ్ అయ్యేది కాదు.

ఫొటో లేదా వీడియో మాత్రమే ఫార్వర్డ్ అయ్యేది. క్యాప్షన్‍ను వేరుగా పంపాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త ఫీచర్‌తో క్యాప్షన్‍తో సహా వీడియోలు, ఫొటోలను ఫార్వర్డ్ చేసే సదుపాయం ఉంటుంది. WABetaInfo తాజా నివేదిక ప్రకారం.. ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి iOS 22.23.77 వాట్సాప్ స్టాండర్డ్​ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఐఓఎస్​ యూజర్లకు మాత్రమే

వాట్సాప్​ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వారి కుటుంబం, స్నేహితులు, ఇతర కాంటాక్ట్స్‌కు ఫోటోలు, వీడియోలు, GIFలకు క్యాప్షన్‌ను యాడ్​ చేసి సెండ్ చేయవచ్చు. క్యాప్షన్ పెట్టడం ద్వారా కీ వర్డ్స్‌ను టైప్ చేసి, పాత ఫైల్‌లను సులభంగా సెర్చ్​ చేసుకునే వీలు కలుగుతుంది. మీడియాతో క్యాప్షన్‌లను షేర్ చేసినప్పుడు స్క్రీన్ దిగువన క్యాప్షన్​ కనిపిస్తుంది.

ఒకవేళ వినియోగదారులు క్యాప్షన్‌ తొలగించాలనుకుంటే ఫార్వార్డ్ చేయడానికి ముందు డిస్మిస్ బటన్​ను నొక్కాల్సి ఉంటుంది. మరోవైపు వాట్సాప్​ తన విండోస్ బీటా వెర్షన్‌లో ‘కాంటాక్ట్ కార్డ్‌’లను పంచుకునే ఫీచర్‌పై కూడా పనిచేస్తుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ యూజర్లను అదే చాట్ షేర్ షీట్‌లో కాంటాక్ట్ కార్డ్‌లను షేర్ చేయడానికి అనుమతిస్తుంది.

కాంటాక్ట్ కార్డ్స్‌​ షేర్​ చేసుకునే ఫీచర్​

ఎవరైనా కాంటాక్ట్ కార్డ్‌ను షేర్ చేస్తే.. రిసీవర్​ వారి అడ్రస్ బుక్‌కు ఆ కాంటాక్ట్​ కార్డును జోడించేందుకు ఈ ఫీచర్​ సహాయపడుతుంది. Windows 2.2247.2.0 వెర్షన్​ వాట్సాప్​ బీటాను డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ ఫీచర్‌ లభిస్తుంది. ఈ కొత్త ఫీచర్ కొంతమంది ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్​ తన డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని ట్రాక్ చేసే ఫీచర్‌పై కూడా పనిచేస్తుంది. ఇటీవల వాట్సాప్​ Windows 2.2246.4.0 అప్‌డేట్ కోసం మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో బీటా వెర్షన్‌ లాంచ్‌ చేసింది.

First published:

Tags: Android, Whatsapp

ఉత్తమ కథలు