Home /News /technology /

WHATSAPP ROLLING OUT ABILITY TO VIEW LIST OF PAST PARTICIPANTS IN GROUPS TO BETA TESTERS UMG GH

WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఈ ఫీచర్‌తో ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చు.. వెరీ యూజ్‌ఫుల్!

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఈ ఫీచర్‌తో ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చు.. తప్పకుండా తెలుసుకోండి..!

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఈ ఫీచర్‌తో ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చు.. తప్పకుండా తెలుసుకోండి..!

పాస్ట్ పార్టిసిపెంట్స్‌ ఫీచర్ సాయంతో యూజర్లు ఒక గ్రూప్‌లో నుంచి 60 రోజుల కాలంలో ఎవరెవరు లెఫ్ట్ అయ్యారో తెలుసుకోవచ్చు. గ్రూప్‌లోనే ఈ సదుపాయాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. ఒక గ్రూపు ఎలాంటిది అనేది అందులోని పార్టిసిపెంట్లు తెలుసుకునేందుకు ఈ ఫీచర్ సహాయపడుతుంది.

ఇంకా చదవండి ...
ఆండ్రాయిడ్, iOS, డెస్క్‌టాప్ యూజర్ల కోసం వాట్సాప్ (WhatsApp) అదిరిపోయే ఫీచర్లను లాంచ్‌ చేస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ గ్రూప్స్‌ (Groups)కి సంబంధించి ఫీచర్లను తీసుకొస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఒకే గ్రూప్‌లో 512 మంది పార్టిసిపెంట్లు జాయిన్ అయ్యేలా లిమిట్ పెంచింది. అలానే గ్రూప్ నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ అయ్యే ఒక కొత్త ఫీచర్‌పై పనిచేస్తుంది. అంతేకాకుండా ఒక గ్రూప్ నుంచి 60 రోజుల్లోపు లెఫ్ట్ అయిన వారి కాంటాక్ట్స్ చూపించే లిస్ట్‌ను పాస్ట్ పార్టిసిపెంట్స్‌ (Past Participants) పేరుతో పరిచయం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ మరికొన్ని వారాల్లో రెగ్యులర్ యూజర్లందరికీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది.

* పాస్ట్ పార్టిసిపెంట్స్‌ ఫీచర్ లాంచ్
పాస్ట్ పార్టిసిపెంట్స్‌ ఫీచర్ సాయంతో యూజర్లు ఒక గ్రూప్‌లో నుంచి 60 రోజుల కాలంలో ఎవరెవరు లెఫ్ట్ అయ్యారో తెలుసుకోవచ్చు. గ్రూప్‌లోనే ఈ సదుపాయాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. ఒక గ్రూపు ఎలాంటిది అనేది అందులోని పార్టిసిపెంట్లు తెలుసుకునేందుకు ఈ ఫీచర్ సహాయపడుతుందని వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్ బీటా iOS 22.16.0.70 వెర్షన్‌లో కొత్త ఫీచర్ అందుబాటు లోకి వచ్చినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. అలాగే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెప్పేందుకు ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో ఒక గ్రూప్‌ ఇన్ఫోపై క్లిక్ చేసిన తర్వాత యాడ్ పార్టిసిపెంట్స్‌ సెక్షన్ కింద సీ పాస్ట్ పార్టిసిపెంట్స్‌ (See Past Participants) అనే ఆప్షన్ కనిపించింది. దానిపై క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ నుంచి ఎవరు ఎప్పుడు లెఫ్ట్ అయ్యారో చూపించే ఒక లిస్టు ఓపెన్ అయ్యింది. ఈ లిస్ట్‌ పైన సెర్చ్ బార్ కూడా ఉంది. దీన్ని ఉపయోగించి ఫలానా వారు లెఫ్ట్ అయ్యారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు.



మొన్నటిదాకా టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో రిలీజ్ అయి యూజర్లను ఆకట్టుకుంటోంది. కొత్త iOS బీటా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ ఫీచర్‌ విడుదల అవుతోంది! "గ్రూప్ పార్టిసిపెంట్‌ల లిస్ట్‌ అనేది గ్రూప్ ఇన్ఫో చివరలో ఒక కొత్త ఆప్షన్ గా ఉంటుంది. ఇది గత 60 రోజులలో గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన లేదా రిమూవ్ చేసిన కాంటాక్ట్స్‌ను కనుగొనడానికి యూజర్లకి వీలు కల్పిస్తుంది" అని WABetaInfo రాసింది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు మాత్రమే కాకుండా మిగతా పార్టిసిపెంట్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. అలా ప్రతి గ్రూప్ మెంబర్ పాస్ట్ పార్టిసిపెంట్ సెక్షన్ ఓపెన్ చేయడం కుదురుతుంది. "గ్రూప్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తుల కాంటాక్ట్స్ ఈ సెక్షన్‌లో లిస్ట్‌ అవుతాయి. కానీ గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు ఇకపై చాట్‌లో కనిపించదు" అని WABetaInfo వెబ్‌సైట్ నివేదించింది. అయితే మోడరేషన్ కోసం ఇది చాట్‌లోని గ్రూప్ అడ్మిన్‌లకు మాత్రమే కనిపిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: New feature, Tech news, Whatsapp, Whatsapp tricks

తదుపరి వార్తలు