WHATSAPP ROLLING OUT 2GB FILE SHARING LIMIT TO MORE USERS FULL DETAILS HERE GH VB
WhatsApp Sharing Limit: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. షేరింగ్ లిమిట్ పెంపు.. ఆ వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఫైల్ షేరింగ్ లిమిట్ (File Sharing Limit)ను 2GBకి పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫీచర్ ఎక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఫైల్ షేరింగ్ లిమిట్ (File Sharing Limit)ను 2GBకి పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూజర్లు ఈ సైజు వరకు ఉన్న ఫైల్‌లను సెండ్(Send) చేసుకునేలా లిమిట్‌ను పెంచుతున్నట్లు వాట్సాప్ మార్చిలో వెల్లడించింది. అయితే ఈ సరికొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను(Sharing Feature) గత కొద్ది వారాల్లో కొందరు యూజర్లకు(Users) మాత్రమే వాట్సాప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మాత్రం మరింత మంది యూజర్ల (More Users)కు ఈ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే దక్షిణ అమెరికా (South America)లో రిలీజ్ చేసింది. ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) యూజర్లకు అందుబాటులో వస్తోంది.
వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, రెగ్యులర్ యూజర్లందరికీ ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు వాట్సాప్‌లోనే నేరుగా లార్జ్ ఫైల్స్ సెండ్ చేయడం సాధ్యమవుతుంది కాబట్టి ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడాల్సిన అవసరం రాదు. ఇప్పుడు యూజర్లు గరిష్ఠంగా 2జీబీ సైజ్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ ఇలా ఇతర మీడియా కంటెంట్‌ను సెండ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ రోజుల్లో వాడే అన్ని ఫోన్లు 4K క్వాలిటీతో ఫొటోలు, వీడియోల క్యాప్చర్ చేస్తున్నాయి. ఇలా మీడియా కంటెంట్ క్వాలిటీ పెరుగుతున్నా కొద్దీ వాటి సైజు కూడా భారీగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత వాట్సాప్ ఫైల్ లిమిట్ అసలు సరిపోవడం లేదు. అందుకే వాట్సాప్ 2జీబీ వరకు లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ యూజర్లందరికీ బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇకపై లార్జ్ ఫైల్స్ షేర్ చేయడానికి టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను వాడాల్సిన పరిస్థితి కూడా రాదు. ఇంతకుముందు, వాట్సాప్ 100ఎంబీ సైజ్ ఉన్న ఫైల్స్‌ను మెసేజింగ్ యాప్ ద్వారా షేర్ చేసుకోవడానికి అనుమతించింది. 2జీబీ ఫీచర్ మీకు కూడా అందుబాటులోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి 100ఎంబీకి పైగా సైజు ఉన్న ఏదైనా ఫైల్‌ను సెండ్ చేయడానికి ప్రయత్నించాలి.
ఒకవేళ అది సెండ్ అయితే మీకు ఈ ఫీచర్ రిలీజ్ అయినట్లు అర్థం. లేదంటే కొద్దిరోజుల పాటు మీరు వెయిట్ చేయాల్సిందే. కొత్త ఫైల్ లిమిట్‌తో పాటు వాట్సాప్ తన యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను జోడిస్తోంది. డెస్క్‌టాప్ యూజర్లకు ఇన్కమింగ్ మెసేజ్‌ల గురించి తెలియజేయడానికి కొత్త అప్డేట్పై కంపెనీ పని చేస్తున్నట్లు ఒక రిపోర్టు తెలిపింది. ఇంకా, త్వరలోనే రానున్న కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ మెసేజ్‌లను కాంటాక్ట్స్, నాన్-కాంటాక్ట్స్, రీడ్ మెసేజ్‌లు, అన్‌రీడ్ మెసేజ్‌లు ఆధారంగా కూడా ఫిల్టర్ చేయగలరు. అంతేకాదు డబుల్ వెరిఫికేషన్, గ్రూప్ వంటి ఫీచర్లను కూడా లాంచ్ చేసే పనిలో వాట్సాప్ నిమగ్నం అయింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.