WhatsApp: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ వచ్చేసింది

WhatsApp fingerprint unlock feature | ఐఫోన్లకు టచ్ ఐడీతో పాటు ఫేస్ ఐడీ ఆథెంటికేషన్ రిలీజ్ చేసింది వాట్సప్. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రం కేవలం ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ మాత్రమే తీసుకొచ్చింది.

news18-telugu
Updated: November 1, 2019, 12:56 PM IST
WhatsApp: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ వచ్చేసింది
WhatsApp: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ వచ్చేసింది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ వచ్చేసింది. కొన్ని నెలలుగా బీటా టెస్టింగ్ చేసిన తర్వాత మొత్తానికి యూజర్లకు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్‌లో వాట్సప్ యూజర్లు ఇప్పుడు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. దీంతో మీ వాట్సప్ ఛాట్స్‌కు బయోమెట్రిక్ సెక్యూరిటీ లభించినట్టైంది. ఇన్ని రోజులు వాట్సప్‌ యాప్‌ని లాక్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్ లాకర్స్ ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పటికే చాలా పాపులర్ యాప్స్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌ని అందిస్తున్నాయి. వాట్సప్ మాత్రం చాలా కాలంగా ఈ ఫీచర్‌ని ఊరిస్తోంది. ఇప్పుడు వాట్సప్ కూడా యూజర్లకు ఫింగర్ ప్రింట్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఐఫోన్లకు టచ్ ఐడీతో పాటు ఫేస్ ఐడీ ఆథెంటికేషన్ రిలీజ్ చేసింది వాట్సప్. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రం కేవలం ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ మాత్రమే తీసుకొచ్చింది.

మరి మీరు వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ వాడుకోవాలనుకుంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయాలి. అప్‌డేట్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ సెట్టింగ్స్‌లో అకౌంట్స్ సెక్షన్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్ ఫీచ్ ఆన్ చేయొచ్చు. యాప్ క్లోజ్ చేయగానే ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ క్లోజ్ కావాలా లేక కొంత సమయం తర్వాత క్లోజ్ కావాలా అని కూడా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇక దీంతో పాటు వాట్సప్‌ను ఒకేసారి వేర్వేరు డివైజ్‌లల్లో వాడుకునే ఫీచర్ కూడా రాబోతోంది.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp Pegasus Malware: వాట్సప్‌పై 'పెగసస్ మాల్‌వేర్' ఎటాక్... ఎంత ప్రమాదమో తెలుసా?

Aadhaar Door Service: ఇక మీ ఇంటి దగ్గరే ఆధార్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండిAadhaar Seva Kendra: హైదరాబాదీలకు గుడ్ న్యూస్... తొలి ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు
Published by: Santhosh Kumar S
First published: November 1, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading