WHATSAPP RIVAL TELEGRAM GOES PREMIUM FASTER DOWNLOADS MORE STORAGE AND 10 OTHER FEATURES UMG GH
Telegram Premium: టెలిగ్రామ్ నుంచి ప్రీమియం వెర్షన్.. ఫాస్టెస్ట్ డౌన్లోడ్స్, స్టోరేజ్‌తో పాటు రానున్న ఫీచర్లు ఇవే
సరికొత్త ఫీచర్లతో టెలిగ్రామ్ వస్తోంది
ప్రైవసీ ఫోకస్డ్, క్లౌడ్ బేస్డ్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు టెలిగ్రామ్ ప్రీమియం (Premium) పేరుతో పెయిడ్ వెర్షన్ iOS, Android ప్లాట్‌ఫారమ్‌లలోకి అందుబాటులోకి వచ్చింది.
ప్రైవసీ ఫోకస్డ్, క్లౌడ్ బేస్డ్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు టెలిగ్రామ్ ప్రీమియం పేరుతో పెయిడ్ వెర్షన్ iOS, Android ప్లాట్‌ఫారమ్‌లలోకి అందుబాటులోకి వచ్చింది. మొబైల్ టెలిగ్రామ్ యాప్‌ను న్యూ వెర్షన్‌కి అప్డేట్ చేయడం ద్వారా పొందవచ్చు. భారతదేశంలో iOS యాప్ వెర్షన్ 8.8లో భాగంగా అప్డేట్ వచ్చింది. కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా అందుబాటులోకి వచ్చింది. టెలిగ్రామ్ ప్రీమియం సబ్స్క్రైబర్లు పొందే కొత్త ఫీచర్లు ఇవే..
సబ్స్క్రిప్షన్ కాస్ట్
టెలిగ్రామ్ అధికారికంగా ప్రైస్ ప్లాన్లను ప్రకటించలేదు. క్లౌడ్-బేస్డ్ మెసేజింగ్ యాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్రతి వినియోగదారుకు నెలకు 4.99 డాలర్లు(రూ. 390) ఉండవచ్చని టెక్ క్రంచ్ రిపోర్ట్ తెలిపింది.
4GB అప్లోడ్
టెలిగ్రామ్ ప్రీమియం సబ్స్క్రైబర్లు 4GB ఫైల్‌లను సెండ్ చేసే అవకాశం ఉంది. 4 గంటల నిడివి ఉన్న 1080p వీడియో లేదా 18 రోజులపాటు కంటిన్యూగా వినే హై క్వాలిటీ ఆడియో ఫైల్‌ను సెండ్ చేయవచ్చని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
వేగవంతమైన డౌన్లోడ్లు
ప్రీమియం సబ్స్క్రైబర్లు మీడియా, ఫైల్‌లను సాధ్యమైన వేగంతో డౌన్లోడ్ చేసుకోగలుగుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
పెరిగిన లిమిట్స్
ప్రీమియం యూజర్ అయితే, యాప్‌లోని దాదాపు అన్నింటికీ పెరిగిన లిమిట్స్‌ను పొందవచ్చు. ప్రీమియం వినియోగదారులు 1000 ఛానెల్‌లను ఫాలో కావచ్చు, ఒక్కొక్కటి 200 చాట్లతో గరిష్టంగా 20 చాట్ ఫోల్డర్లను సృష్టించవచ్చు, ఏదైనా టెలిగ్రామ్ యాప్‌కి నాలుగో ఖాతాను జోడించవచ్చు, ప్రధాన జాబితాలో 10 చాట్లను పిన్ చేయవచ్చు, 10 ఇష్టమైన స్టిక్కర్లను సేవ్ చేయవచ్చు అని ఓ బ్లాగ్ పోస్ట్‌లో టెలిగ్రామ్ తెలిపింది. ప్రీమియం సభ్యులు.. లింక్‌తో సుదీర్ఘమైన బయోని జత చేయవచ్చు, మీడియా శీర్షికలకు మరిన్ని అక్షరాలను జోడించవచ్చు, గరిష్టంగా 400 ఇష్టమైన GIFలకు యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. ప్రీమియం వినియోగదారులు 20 పబ్లిక్ t.me లింక్‌లను కూడా రిజర్వ్ చేసుకోవచ్చు.
వాయిస్-టూ-టెక్స్ట్ కన్వర్షన్
ప్రీమియం సబ్స్క్రైబర్లు వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చుకునే అవకాశం ఉంది.
స్పెషల్ స్టిక్కర్లు
వివిధ రకాల ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వీలుగా డజన్ల కొద్దీ టెలిగ్రామ్ స్టిక్కర్లు ఫుల్-స్క్రీన్ యానిమేషన్లతో అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం వినియోగదారుల కోసం స్టిక్కర్ కలెక్షన్‌కు ప్రతి నెలా కొత్తవి యాడ్ కానున్నాయి.
యునిక్ రియాక్షన్స్
మెసేజింగ్ యాప్ ప్రీమియం వినియోగదారుల కోసం 10కి పైగా కొత్త ఎమోజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చాట్ మేనేజ్మెంట్ ఫీచర్లు
చాట్ లిస్ట్ నుంచి డిఫాల్ట్ చాట్ ఫోల్డర్‌ను మార్చడం వంటి కొత్త ఫీచర్లను ప్రీమియం సబ్స్క్రైబర్లు అందుకుంటారు.
ప్రీమియం యానిమేటెడ్ ప్రొఫైల్ పిక్చర్స్, ప్రీమియం బ్యాడ్జ్‌లు
ప్రీమియం సబ్స్క్రైబర్ల ప్రొఫైల్ వీడియోలు చాట్లు, చాట్ లిస్ట్‌తో సహా యాప్ అంతటా అందరికీ యానిమేట్ అవుతాయి. వారు ప్రీమియం బ్యాడ్జ్‌ని పొందుతారు. ఇది చాట్ లిస్ట్, చాట్ హెడర్లు, గ్రూప్‌లలోని సభ్యుల జాబితాలలో వారి పేరు పక్కన కనిపిస్తుంది.
న్యూ యాప్ ఐకాన్లు
ప్రీమియం వినియోగదారులు తమ హోమ్ స్క్రీన్లకు జోడించగల కొత్త చిహ్నాలను పొందుతారు. ప్రీమియం స్టార్, నైట్ స్కై లేదా టర్బో-ప్లేన్ నుంచి ఎంచుకోవచ్చు.
గుడ్ బై టూ యాడ్స్
యాప్ ప్రీమియం వెర్షన్లు కస్టమర్లకు యాడ్స్ కనిపించకుండా చేస్తాయి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.