Telegram: టెలిగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఫీచర్ వచ్చేసింది..

కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్న ఎవరికైనా టెలిగ్రామ్ నుంచి వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. కాల్ మధ్యలో వీడియో‌ను స్విచ్ ఆన్, స్విచాఫ్ చేసే సదుపాయం కూడా ఉంది.

news18-telugu
Updated: August 16, 2020, 5:18 PM IST
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఫీచర్ వచ్చేసింది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాట్సప్..! ప్రస్తుతం అందరి ఫోన్లలో ఉండే మెసేజింగ్ యాప్. దీనికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది టెలిగ్రామ్. ఐతే వాట్సప్‌తో పోల్చితే ఆకర్షణీయమైన, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ లేకపోవడంతో వెనకబడుతోంది. అందుకే వాట్సప్‌కు ధీటుగా అద్భుతమైన ఫీచర్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది టెలిగ్రామ్. ఈ క్రమంలోనే తమ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. టెలిగ్రామ్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెలిగ్రామ్ బీటా వర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే 7.0 వర్షన్‌లోనూ తీసుకొస్తామని టెలిగ్రామ్ వెల్లడించింది. ఇకపై కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్న ఎవరికైనా టెలిగ్రామ్ నుంచి వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. కాల్ మధ్యలో వీడియో‌ను స్విచ్ ఆన్, స్విచాఫ్ చేసే సదుపాయం కూడా ఉంది.

వీడియో కాల్స్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌ను కూడా తీసుకొచ్చారు. తద్వారా వీడియో కాల్ మాట్లాడుతూనే ఇతర ఆప్షన్స్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఆడియో కాల్స్ విషయంలో వినియోగదారులకు వ్యక్తిగత భద్రత ఉంటుంది. ఆడియో కాల్స్ మాదిరే అన్ని వీడియో కాల్స్‌ను ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసినట్లు టెలిగ్రామ్ తెలిపింది. వీడియో కాలింగ్ సమయంలో స్క్రీన్‌పై నాలుగు ఎమోజీలు కనిపిస్తాయి. అవతలి వ్యక్తికి కూడా అవే ఎమోజీలు కనిపిస్తే కాల్ ఎన్‌క్రిప్ట్ చేసినట్లు అర్ధం చేసుకోవాలి. వీడియో కాలింగ్‌తో పాటు ఎమోజీల్లోనూ ఎన్నో మార్పులు చేసింది. ఇకపై చాట్ బాక్స్‌లో ఎమోజీని టైప్‌చేస్తే పెద్ద సైజులో ఉండే యానిమేటెడ్ ఎమోజీ కనిపిస్తుంది.

వాట్సప్‌తో పోల్చితే టెలిగ్రామ్‌లో ఫైల్ షేరింగ్ సదుపాయం బాగుందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడతారు. వాట్సప్‌లో తక్కువ సైజులో ఉండే వీడియోలను మాత్రమే షేర్ చేసుకోవచ్చు. అదే టెలిగ్రామ్‌లో ఐతే 2 జీబీ పరిమాణం వరకు వీడియోలను పంపుకోవచ్చు. ఈ సదుపాయం చాలా మంది యూత్‌కు బాగా నచ్చింది. అందుకే చాలా మంది వాట్సప్ వాడుతూనే టెలిగ్రామ్‌ను కూడా యూజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్‌కు ధీటుగా యూజర్లకు దగ్గరయ్యేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది టెలిగ్రామ్.
Published by: Shiva Kumar Addula
First published: August 16, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading