Home /News /technology /

WhatsApp: వాట్సప్ ఫైల్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నిండిపోయిందా? ఈ కొత్త ఫీచర్‌తో స్టోరేజ్ సమస్యకు చెక్

WhatsApp: వాట్సప్ ఫైల్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నిండిపోయిందా? ఈ కొత్త ఫీచర్‌తో స్టోరేజ్ సమస్యకు చెక్

WhatsApp: వాట్సప్ ఫైల్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నిండిపోయిందా? ఈ కొత్త ఫీచర్‌తో స్టోరేజ్ సమస్యకు చెక్
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సప్ ఫైల్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నిండిపోయిందా? ఈ కొత్త ఫీచర్‌తో స్టోరేజ్ సమస్యకు చెక్ (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp New Feature | వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలతో మీ స్మార్ట్‌ఫోన్ నిండిపోయిందా? స్టోరేజ్ సమస్యకు చెక్ పెట్టే ఫీచర్ వచ్చేసింది. మీరూ వాడుకోండి ఇలా.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం తరచూ సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తుంది. ఈసారి 'వ్యూ వన్స్' అనే అద్భుతమైన ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యూ వన్స్ ఫీచర్‌ ఎనేబుల్ చేసి ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. అవతలి వ్యక్తి ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చూసేందుకు వీలుండదు. దీన్ని ఎంచుకొని మనం పంపే ఫొటోలు, వీడియోలు ఇతరులు ఒక్కసారి చూడగానే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా పంపే ఫొటోలు, వీడియోలు ఇతరుల మీడియా గ్యాలరీలో లేదా ఫొటోస్ లలో స్టోర్ కావు. దీంతో వాట్సప్ స్టోరేజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్టే.

Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ

UMANG App: పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి

వాట్సాప్ 'వ్యూ వన్స్' కీ-ఫీచర్స్


1. వ్యూ వన్స్ ద్వారా సెండ్ చేసే మీడియా ఇతరుల ఫొటోస్ లేదా గ్యాలరీలో స్టోర్ కాదు.
2. మనం వ్యూ వన్స్ ఫీచర్ యూజ్ చేసి పంపే ఫొటో, వీడియో ఒక్కసారి చూడటానికి మాత్రమే వీలుంటుంది. మరోసారి ఓపెన్ చేయడం కుదరదు.
3. వ్యూ వన్స్ ఫీచర్ ఎనేబుల్ చేసి పంపే మీడియాని ఇతరులు ఫార్వర్డ్, సేవ్, స్టార్, షేర్ చేయలేరు.
4. ఇతరులు 'read receipts' సెట్టింగ్ ఆన్ చేసుకుంటే.. మనం సెండ్ చేసిన వ్యూ వన్స్ మీడియాని చూశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇతరులు మీడియా ఓపెన్ చేయగానే 'Opened' స్టేటస్ కనిపిస్తుంది.
5. మనం పంపే వ్యూ వన్స్ మీడియాని అవతల వ్యక్తి 14 రోజులలోపు చూడకపోతే.. అది చాట్ నుంచి దానంతటదే ఎక్స్‌పైర్‌ అయిపోతుంది.
6. వ్యూ వన్స్ ఫొటో లేదా వీడియో పంపించాలంటే.. మెసేజ్ ప్రివ్యూలో ప్రతిసారి 'ViewOnce Icon' పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
7. బ్యాకప్ సమయంలో వ్యూ వన్స్ మీడియాని తెరవకపోతే బ్యాకప్ నుంచి మీడియాను రీస్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాకప్‌ అవ్వకముందే ఫొటో లేదా వీడియోని ఓపెన్ చేస్తే.. బ్యాకప్‌లో మీడియా స్టోర్ కాదు. ఫలితంగా రీస్టోర్ చేయడానికి వీలుండదు.

Vivo Y72 5G: మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు... ఆఫర్ వివరాలివే

Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయడం మర్చిపోవద్దు

వాట్సాప్ లో 'వ్యూ వన్స్' ఫొటో లేదా వీడియో ఎలా పంపించాలి:


మీరు ఫొటో లేదా వీడియో పంపించే సమయంలో.. సెండ్ బటన్ పక్కన "1" బటన్ కనిపిస్తుంది. తర్వాత ఈ "1" బటన్ లేదా ఈ 1 ఐకాన్ పై చేయాలి. ఇప్పుడు మీకు "Photo set to view once" అని కనిపిస్తుంది. తర్వాత సెండ్ చేస్తే అది వ్యూ వన్స్ ఫొటోగా సెండ్ అవుతుంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా వ్యూ వన్స్ మీడియాకి భద్రత లభిస్తుంది. వాట్సాప్ వ్యూవన్స్ మీడియా మెసేజ్‌లను వీక్షించదని సంస్థ వెల్లడించింది. వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన సమాచారం పంపించేందుకు వ్యూ వన్స్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
First published:

Tags: Whatsapp

తదుపరి వార్తలు