WhatsApp Stickers: వాట్సప్‌లో వ్యాక్సిన్ స్టిక్కర్స్ భలే ఉన్నాయిగా... మీరూ డౌన్‌లోడ్ చేయండి ఇలా

WhatsApp Stickers: వాట్సప్‌లో వ్యాక్సిన్ స్టిక్కర్స్ భలే ఉన్నాయిగా... మీరూ డౌన్‌లోడ్ చేయండి ఇలా (image: WhatsApp)

WhatsApp Vaccines for All stickers | వాట్సప్ కొత్తగా వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్స్‌ని రిలీజ్ చేసింది. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ప్రస్తుతం దేశమంతా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైన వయస్సు ఉన్నవారందరికీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకోవాలంటూ అనేక సంస్థలు ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెట్‌వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ సంయుక్తంగా సంజీవని కార్యక్రమం కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO తో కలిసి వాట్సప్ కూడా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. Vaccines for All పేరుతో స్టిక్కర్ ప్యాక్ రూపొందించింది. ఈ స్టిక్కర్ ప్యాక్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు రిలీజ్ చేస్తోంది. వాట్సప్ యూజర్లు అందరూ వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్లు ఉపయోగించుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ ఫన్నీగా ఉండటమే కాదు వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు ఉపయోగపడ్తాయి. వీటిని మీరూ డౌన్‌లోడ్ చేసుకొని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయొచ్చు. మరి వాట్సప్‌లో వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

    Mi 10i: రూ.21,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... ఈరోజే ఫ్లాష్ సేల్

    Curie Doc App: టీ-హబ్ నుంచి 'క్యూరీ డాక్' స్టార్టప్... ఈ యాప్ ఉంటే డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే

    WhatsApp Stickers: వాట్సప్‌లో వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేయండి ఇలా


    ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
    ఎవరిదైనా ఛాట్ ఓపెన్ చేయండి.
    ఆ తర్వాత ఛాట్ బాక్స్‌లో స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
    ఆ తర్వాత ఎమొజీ, గిఫ్, స్టిక్కర్ ఐకాన్స్ కనిపిస్తాయి.
    అందులో స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
    మీరు ముందే డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
    ఆ వరుసలో చివర్లో మీకు కనిపించే + ఐకాన్ పైన క్లిక్ చేయండి.
    All Stickers లిస్ట్‌లో Vaccines for All స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది.
    డౌన్‌లోడ్ పైన క్లిక్ చేస్తే వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ అవుతుంది.
    ఆ తర్వాత మళ్లీ ఎవరిదైనా చాట్ ఓపెన్ చేయండి.
    అందులో స్టిక్కర్ సెక్షన్‌లోకి వెళ్లండి.
    మీకు వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్స్ కనిపిస్తాయి.

    Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

    Evaru Meelo Koteeswarulu: 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోకి రిజిస్ట్రేషన్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి

    ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఇలాగే స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయొచ్చు. వాట్సప్ వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ స్టిక్కర్ ప్యాక్‌లో మొత్తం 23 స్టిక్కర్స్‌ని రూపొందించింది. ఇవి మాత్రమే కాదు గతంలో కూడా కోవిడ్ 19 పై అవగాహన కల్పించేందుకు స్టిక్కర్ ప్యాక్స్ రిలీజ్ చేసింది వాట్సప్. Together at Home పేరుతో ఇందులో 21 స్టిక్కర్స్ ఉన్నాయి. వీటిని కూడా పైన చెప్పిన పద్ధతిలోనే డౌన్‌లోడ్ చేసి ఉపయోగించుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: