WhatsApp: వాట్సప్ యూజర్లకు సర్‌ప్రైజ్... అదిరిపోయే ఫీచర్ రిలీజ్

WhatsApp Messenger Rooms | వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 25, 2020, 6:57 PM IST
WhatsApp: వాట్సప్ యూజర్లకు సర్‌ప్రైజ్... అదిరిపోయే ఫీచర్ రిలీజ్
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూజర్లను సర్‌ప్రైజ్ చేసింది వాట్సప్. లాక్‌డౌన్ టైమ్‌లో అదిరిపోయే ఫీచర్ రిలీజ్ చేసింది. గత నెలలో ఫేస్‌బుక్ మెసెంజర్ కోసం మెసెంజర్ రూమ్స్ ఫీచర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫీచర్‌ను వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 50 మందితో వీడియో కాల్స్‌లో మాట్లాడొచ్చు. లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా వీడియో కాల్స్, మీటింగ్స్ చేసుకునేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వాడుకోవాలంటే యూజర్లకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాలి. మెసెంజర్ రూమ్ క్రియేట్ చేసి వీడియో కాల్స్ చేయొచ్చు. ఇందులోని కాల్స్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉంటాయి కాబట్టి మీ డేటాకు ముప్పేమీ ఉండదని వాట్సప్ చెబుతోంది. ఈ ఫీచర్ ఇప్పటికే బీటా యూజర్లకు రిలీజైంది. త్వరలో మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్ రానుంది. మరి వాట్సప్‌లో మెసెంజర్ రూమ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి.

ఆండ్రాయిడ్, ఐఫోన్, డెస్క్‌టాప్ యాప్‌లో మీకు మెసెంజర్ రూమ్స్ షార్ట్‌కట్ ఉంటుంది.

ఆండ్రాయిడ్ డివైజ్‌లో వాట్సప్ ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
అక్కడ మెసెంజర్ రూమ్స్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాంటాక్ట్స్‌ని యాడ్ చేయాలి.
ఛాట్ ఓపెన్ చేసి అక్కడ అటాచ్ ఐకాన్ పైన క్లిక్ చేసినా మెసెంజర్ రూమ్ క్రియేట్ చేయొచ్చు.
మీరు క్రియేట్ చేసిన మెసెంజర్ రూమ్ లింక్‌ను ఇతరులకు షేర్ చేయొచ్చు.
లింక్ స్వీకరించినవాళ్లు ఆ లింక్ పైన క్లిక్ చేసి మెసెంజర్ రూమ్‌లో యాడ్ కావొచ్చు.ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ పార్టిసిపెంట్స్‌తో రూమ్ క్రియేట్ చేయాలి.

ఇవి కూడా చదవండి:

Airtel: ఎక్కువ డేటాతో ఎయిర్‌టెల్ ప్రకటించిన కొత్త ప్లాన్స్ ఇవే...

Vodafone: వొడాఫోన్‌లో ఈ ప్లాన్‌పై డబుల్ డేటా

Realme Smart TV: రియల్‌మీ స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా
Published by: Santhosh Kumar S
First published: May 25, 2020, 6:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading