హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్ యూజర్లకు బ్లాక్ షార్ట్‌కట్ ఫీచర్.. ఇక, కాంటాక్ట్స్‌ను డైరెక్ట్‌గా బ్లాక్ చేయవచ్చు!

WhatsApp: వాట్సాప్ యూజర్లకు బ్లాక్ షార్ట్‌కట్ ఫీచర్.. ఇక, కాంటాక్ట్స్‌ను డైరెక్ట్‌గా బ్లాక్ చేయవచ్చు!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సాప్ బ్లాక్ షార్ట్‌కట్ (Block Shortcut) పేరుతో ఒక సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.2.10 వెర్షన్ యూజర్లకు రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్‌ను పొందడానికి ఆ లేటెస్ట్ బీటా బీర్షన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp), ప్రస్తుత యూజర్లను నిలుపుకోవడంతో పాటు కొత్తవారిని ఆకట్టుకునేందుకు చాలా అద్భుతమైన ఫీచర్ల (New Features)ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్లాక్ షార్ట్‌కట్స్ (Block Shortcuts) పేరుతో ఒక సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.2.10 వెర్షన్ యూజర్లకు రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్‌ను పొందడానికి ఆ లేటెస్ట్ బీటా బీర్షన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.2.8, 2.23.2.9 వెర్షన్లలోనూ కొందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వివరాలన్నీ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో స్క్రీన్‌షాట్ల ద్వారా వివరించింది.

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, బ్లాక్ షార్ట్‌కట్స్ అంటే వాట్సాప్ యూజర్లకు కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయడానికి ఉపయోగపడే రెండు సత్వర మార్గాలు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఒక కాంటాక్ట్‌ని బ్లాక్ చేయాలంటే.. ఆ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని.. దాని ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేసి.. కిందికి స్క్రోల్ చేసి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా టైమ్‌తో కూడుకున్న పని. ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ బ్లాక్ షార్ట్‌కట్స్ చాలా వేగంగా బ్లాక్ చేసుకోవడానికి సహాయపడుతాయి.

* ఎలా పనిచేస్తుంది?

WABetaInfo షేర్ చేసిన ఫస్ట్ స్క్రీన్‌షాట్‌ను పరిశీలిస్తే కొత్త ఫీచర్ వచ్చాక బ్లాక్ చేసుకునే సదుపాయం చాట్ లిస్టులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్‌లో చాట్ లిస్ట్ ఓపెన్ చేసి ఒక చాట్‌పై లాంగ్ క్లిక్ ఇవ్వడం ద్వారా చాట్ ఆప్షన్స్ వస్తాయనే విషయం తెలిసిందే. ఈ చాట్ ఆప్షన్స్‌లో లాస్ట్ ఆప్షన్‌గా బ్లాక్ (Block) ఆప్షన్ కనిపిస్తోంది. దీనిపై క్లిక్ చేయడం ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్ మెసేజెస్ చదవకుండానే దానిని ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు.

మరొక స్క్రీన్‌షాట్‌ను పరిశీలిస్తే కాంటాక్ట్స్‌ను నోటిఫికేషన్లలోనే బ్లాక్ చేసుకునే ఆప్షన్ వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త కాంటాక్ట్స్ నుంచి చాలా ఎక్కువగా మెసేజ్‌లు వస్తుంటే వాటిని సింపుల్‌గా నోటిఫికేషన్ ద్వారానే బ్లాక్ చేయడానికి ఈ షార్ట్‌కట్ యూజర్లకు ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా టైమ్‌ సేవ్ అవుతుంది. కాగా ప్రస్తుతానికి, చాట్ లిస్ట్‌ నుంచి నేరుగా ఒకటికంటే ఎక్కువ కాంటాక్ట్స్‌ ఒకేసారి బ్లాక్ చేయడానికి ఉపయోగపడే ఎలాంటి ఫీచర్ వాట్సాప్ తీసుకురావడం లేదు. ఒకవేళ ఒకేసారి చాలా కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేసే ఫీచర్ కూడా వస్తే యూజర్లకు మరింత టైమ్‌ సేవ్ అవుతుంది.

ఇది కూడా చదవండి : తక్కువ ధరకే ట్విట్టర్ బ్లూ యాన్యువల్ ప్లాన్.. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా సేవలు

ఇక వాట్సాప్ డేట్ వైజ్‌గా మెసేజ్ సెర్చ్ చేసే, ఇతర యాప్‌ల నుంచి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను డ్రాగ్ & డ్రాప్ చేసే సామర్థ్యాన్ని బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెస్తోంది. అలాగే యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో వాట్సాప్ ఫొటోలను వాటి ఒరిజినల్ క్వాలిటీలో పంపించే ఒక సదుపాయం కూడా పరిచయం చేసే పనిలో నిమగ్నం అయ్యింది.

First published:

Tags: New feature, Tech news, Whatsapp

ఉత్తమ కథలు