news18-telugu
Updated: January 23, 2020, 12:30 PM IST
WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ వచ్చేసింది... సెట్టింగ్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సప్‌లో డార్క్ మోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వాట్సప్ అనేక కొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తోంది కానీ... డార్క్ మోడ్ విషయంలో సస్పెన్స్ కొనసాగించింది. మొత్తానికి డార్క్ మోడ్ రిలీజ్ చేసింది వాట్సప్. ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫీచర్‌ను బీటా ప్రోగ్రామ్‌లో ఉన్నవారంతా ఉపయోగించొచ్చు. మీరు ఆండ్రాయిడ్ బీటా వర్షన్ ఉపయోగిస్తున్నట్టైతే 2.20.13 అప్డేట్ చేయాలి. ఆ తర్వాతే డార్క్ మోడ్ ఫీచర్ వాడుకునే అవకాశముంటుంది. మరి మీరు మీ వాట్సప్‌ని అప్డేట్ చేసిన తర్వాత డార్క్ మోడ్ కోసం సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మర్చాలో తెలుసుకోండి.

image: wabetainfo
Whatsapp Dark Mode: వాట్సప్ డార్క్ మోడ్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి
ముందుగా మీ వాట్సప్ అప్డేట్ చేయండి.
త్రీ డాట్ మెనూ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
ఛాట్స్ సెలెక్ట్ చేయండి.
అందులో Dark, Light, System Default ఆప్షన్స్ ఉంటాయి.Dark సెలెక్ట్ చేస్తే మీ వాట్సప్ డార్క్‌మోడ్‌లోకి మారిపోతుంది.
మళ్లీ Light క్లిక్ చేస్తే నార్మల్ మోడ్ లోకి వస్తుంది.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న డార్క్ మోడ్ లాగానే వాట్సప్ డార్క్ మోడ్ ఉంటుంది. స్టేటస్ ఫీడ్, ఛాట్ ఫీడ్ లాంటివన్నీ డార్క్ థీమ్‌లో కనిపిస్తాయి. అయితే వాట్సప్ వెబ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఎక్కువగా మొబైల్ ఫోన్ ఉపయోగించేవారికి డార్క్ మోడ్ వల్ల లాభాలుంటాయి. కళ్లకు హాని కలగకుండా డార్క్ మోడ్ ఉపయోగించొచ్చు. అంతేకాదు... ఫోన్ బ్యాటరీ కూడా ఆదా అవుతుంది.
ఇవి కూడా చదవండి:
Reliance offers: రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్‌లో 'ఫుల్ పైసా వసూల్' సేల్... ఆఫర్స్ ఇవే
రైలు ఆలస్యమైందని ప్రయాణికులకు రూ.63,000 నష్టపరిహారం
EPFO: గుడ్ న్యూస్... ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త సదుపాయం
Published by:
Santhosh Kumar S
First published:
January 23, 2020, 12:30 PM IST