Whatsapp : వాట్సాప్‌ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్.. గ్రూప్ చాట్ బయటకు రాకుండా హైడ్‌ చేసే ఆప్షన్..

Whatsapp : వాట్సాప్‌ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్.. గ్రూప్ చాట్ బయటకు రాకుండా హైడ్‌ చేసే ఆప్షన్..

WhatsApp : ఒకవేళ యూజర్ ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో ఉంటే.. ఆ గ్రూపు నుంచి బయటకు రాకుండా, చాట్‌ కన్వర్జేషన్లు లేదా మెసేజ్‌లను ప్రతిసారీ చూడాల్సిన అవసరం లేకుండా హైడ్‌ చేయవచ్చు.

  • Share this:
వివిధ ప్లాట్‌ఫాంల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పోటీ పెరుగుతున్న వేళ.. షార్ట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఉన్న అర్కైవ్ మెసేజ్‌ ఫీచర్‌ను వాట్సాప్ తాజాగా అప్‌డేట్ చేసింది. అర్కైవ్‌ చేసిన చాట్‌ల పనితీరుపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండాలనే ఉద్దేశంతో ఈ కొత్త అప్‌డేట్‌ను ఆవిష్కరించింది. అర్కైవ్‌ చాట్‌ ద్వారా మీ చాట్‌ లిస్ట్ నుంచి ఎవరైనా వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్ ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో ఉంటే.. ఆ గ్రూపు నుంచి బయటకు రాకుండా, చాట్‌ కన్వర్జేషన్లు లేదా మెసేజ్‌లను ప్రతిసారీ చూడాల్సిన అవసరం లేకుండా హైడ్‌ చేయవచ్చు. ఆ గ్రూప్‌లో వచ్చే నోటిఫికేషన్లు సైతం చాట్ లిస్ట్‌లో కనిపించకుండా కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ ఆవిష్కరించింది.

కొత్త అప్‌డేట్ తరువాత కన్వర్జేషన్లను అర్కైవ్‌ చేస్తే, అవి డిలీట్ కావు. కేవలం హైడ్ అవుతాయి. అంతేకాకుండా ఏ సమయంలోనైనా వాటిని అన్ అర్కైవ్‌ (Un Archived) చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, వాట్సాప్ వెబ్-డెస్క్‌టాప్ వెర్షన్లలో అర్కైవ్‌ మెసేజెస్ ఆప్షన్ విభిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో చాట్ లిస్ట్‌ను ఎలా అర్కైవ్‌ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్..
చాట్‌ గ్రూపులో మీరు అర్కైవ్‌ చేయాలనుకున్న వ్యక్తి లేదా గ్రూపును కాసేపు అలాగే నొక్కి ఉంచాలి. అనంతరం స్క్రీన్‌ పైభాగంలోని రైట్ కార్నర్‌లో.. కిందకు సూచించే బాణం గుర్తు ఒకటి కనిపిస్తుంది. దానిపై నొక్కితే మీ గ్రూప్ హైడ్ అవుతుంది.

ఐఫోన్..
ఐపోన్ దగ్గరకొస్తే మీరు అర్కైవ్‌ చేయాలనుకున్న చాట్‌ లేదా గ్రూపును ఎడమవైపు స్వైప్ చేసి అర్కైవ్‌ బటన్‌పై నొక్కాలి.

వాట్సాప్ వెబ్..
వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లో మీరు అర్కైవ్‌ చేయాలనుకున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ మీద రైట్ క్లిక్ చేయాలి. అనంతరం అర్కైవ్‌ చాట్‌ బటన్‌పై క్లిక్ చేయండి. చాట్‌ లేదా గ్రూపును అర్కైవ్‌ చేయడానికి మీరు కాంటాక్ట్ నేమ్ లేదా గ్రూప్ సబ్జెక్టు కోసం సెర్చ్ చేయాలి.

ఇటీవలే అప్డేట్
అర్కైవ్డ్ చాట్స్‌ కోసం వాట్సాప్ కొత్త సెట్టింగ్స్ రూపొందించింది. యూజర్లకు ఈ అప్‌డేట్‌ను వాట్సాప్ అందిస్తోంది. ఇది వినియోగదారులకు ఇన్ బాక్స్‌పై మరింత నియంత్రణను అందిస్తుంది. చాలా మంది వినియోగదారులు అర్కైవ్‌ చేసిన చాట్ లిస్ట్‌ను ప్రత్యేకంగా ఒక ఫోల్డర్లో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త సెట్టింగ్స్‌ను వాట్సాప్ అప్‌డేట్ ద్వారా అందించింది. గతంలో అర్కైవ్ చేసిన కాంటాక్ట్‌ లేదా గ్రూప్‌లో కొత్త మేసేజ్ వస్తే.. అది మళ్లీ చాట్ లిస్ట్‌లో కనిపించేది. కానీ కొత్త అప్‌డేట్ ద్వారా నోటిఫికేషన్లు వచ్చినా, అర్కైవ్డ్‌ లిస్ట్‌ నుంచి బయటకు కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు.
Published by:Sridhar Reddy
First published: