హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp Privacy: మీ వాట్సప్ వేరేవాళ్లు చూస్తున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Privacy: మీ వాట్సప్ వేరేవాళ్లు చూస్తున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Privacy: మీ వాట్సప్ వేరేవాళ్లు చూస్తున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చండి
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Privacy: మీ వాట్సప్ వేరేవాళ్లు చూస్తున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Privacy Settings | వాట్సప్‌లో ఉన్న ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? వాట్సప్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్ మార్చి మీ యాప్‌ను సేఫ్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? మీ ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేస్తుంటారా? మీరు ఛాటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారో ఇతరులకు తెలిసిపోతుందన్న అనుమానం ఉందా? మీ ఛాటింగ్ సీక్రెట్‌గా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. వాట్సప్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ చాలా ఉంటాయి. వాటిని ఉపయోగించుకునేవారు తక్కువ. వాట్సప్ ఛాటింగ్, మీడియా, ఇతర సమాచారం... ఇలా ప్రతీ దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకొని మీ వాట్సప్‌ని సేఫ్‌గా మార్చుకోవచ్చు. మరి వాట్సప్‌లో మీరు మార్చాల్సిన ప్రైవసీ సెట్టింగ్స్ ఏవో తెలుసుకోండి.

వాట్సప్‌లో టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ లాక్ ఉంటుంది. మీ వాట్సప్‌ని లాక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ సెట్టింగ్స్‌లో అకౌంట్‌లో ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ ఉంటుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి. గూగుల్‌లో ఉన్నట్టుగానే వాట్సప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 6 అంకెల పిన్ ఎంటర్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలి. మీరు ఎప్పుడైనా వాట్సప్ రీ ఇన్‌స్టాల్ చేస్తే పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. దీని ద్వారా ఎవరైనా మీ నెంబర్‌తో వాట్సప్ ఇన్‌స్టాల్ చేయాలన్నా సాధ్యం కాదు. వాట్సప్ సెట్టింగ్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది.

ఇవే కాదు... వాట్సప్ స్టేటస్‌లో మరికొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి. మీ స్టేటస్, ప్రొఫైల్ ఫోటో లాంటివి ఎవరు చూడాలో మీరే సెట్టింగ్స్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీ క్లిక్ చేసి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అందులో మీకు లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, గ్రూప్స్, స్టేటస్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో సెట్టింగ్స్ చేయొచ్చు. మీ స్టేటస్ ఎవరు చూడాలనుకుంటే వారి పేర్లు మాత్రమే సెలెక్ట్ చేయొచ్చు. Everyone, My contacts, Nobody అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... మీ వాట్సప్ యాప్‌ను ఎప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. మీ ఛాటింగ్‌లో, వాట్సప్ కాల్స్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే యాప్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి. యాప్ అప్‌డేట్ చేసినప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ వస్తుంటాయి. దాంతోపాటు బగ్స్, మాల్‌వేర్ లాంటి సమస్యలు పరిష్కారమవుతాయి.

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్

Google Tips: ఈ 8 టిప్స్ ఫాలో అయితే ఆన్‌లైన్‌లో మోసపోరు

Redmi Note 8: షాకిచ్చిన షావోమీ... రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది

First published:

Tags: Android, Mobile App, Whatsapp

ఉత్తమ కథలు