Home /News /technology /

WHATSAPP PRIVACY POLICY WHATSAPP IS LEAKING MANY NUMBERS IN PUBLIC SEARCH SK GH

WhatsApp Web URLs leak: వాట్సాప్‌పై మరో రచ్చ.. గూగుల్‌ సెర్చ్‌లో ఫోన్ నెంబర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్‌ పబ్లిక్ డొమైన్‌లో వాట్సాప్ ఫర్ వెబ్ URLలు ఇండెక్స్ అవుతున్నాయని రాజశేఖర్ న్యూస్18తో చెప్పారు. దీని ద్వారా బయటి వ్యక్తులు యూజర్ కాంటాక్ట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

వాట్సాప్ కొత్త పాలిసీపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అంతేకాదు గ్రూప్ ఇన్వైట్ లింక్‌ల లీకేజీతో వాట్సాప్‌పై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో సంచలన విషయం బయట పడింది. వాట్సాప్‌పై తాజాగా ఫోన్‌ నంబర్ల లీకేజీ ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్ యూజర్ల ప్రైవేట్ ఫోన్ నంబర్లు పబ్లిక్ ప్లాట్‌ఫాంలలో ఇండెక్స్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ ఓపెన్ సెర్చ్‌లో వాట్సాప్ ఫర్ వెబ్ URLలు స్క్రోల్ అవుతున్నాయి. దీనివల్ల పర్సనల్ కంప్యూటర్లలోని వెబ్ బ్రౌజర్‌లో వాట్సాప్ ఉపయోగించేవారి కాంటాక్ట్ వివరాలు గూగుల్ సెర్చ్‌లో కనిపించే అవకాశం ఉంది. దీంతో స్పామర్‌లు, సైబర్ నేరస్థులు వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లను, చాట్ లిస్ట్‌లను యాక్సెస్ చేయవచ్చు. గతంలో వాట్సాప్ గ్రూప్ ఇన్వైట్ లింకులు పబ్లిక్ ప్లాట్‌ఫాంలలో లీక్ అవుతున్నాయని గుర్తించిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా దీన్ని గుర్తించారు. గూగుల్‌లో వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్ల జాబితా కనిపిస్తోందని ఆయన ధ్రువీకరించారు.

గూగుల్‌ పబ్లిక్ డొమైన్‌లో వాట్సాప్ ఫర్ వెబ్ URLలు ఇండెక్స్ అవుతున్నాయని రాజశేఖర్ న్యూస్18తో చెప్పారు. దీని ద్వారా బయటి వ్యక్తులు యూజర్ కాంటాక్ట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. సాధారణంగా వాట్సాప్ లింక్‌లలో ఆటోమేటెడ్ ఇన్‌స్ట్రక్షన్ ఫైల్ ఉంటుంది. ఇలాంటివి గూగుల్‌లో ఇండెక్సింగ్ కావు. కానీ ప్రస్తుతం ఏదో ప్రైవసీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండవచ్చని రాజశేఖర్ తెలిపారు.

గత కొన్ని రోజుల నుంచి వాట్సాప్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల గూగుల్‌లో వాట్సాప్ గ్రూప్ ఇన్వైట్ లింక్‌లు ఇండెక్సింగ్ అయ్యాయి. దీనివల్ల బయటి వ్యక్తులు ఎవరైనా ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చని నిపుణులు చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని వాట్సాప్ తెలిపింది. గ్రూప్ ఇన్వైట్ లింక్‌లను ఇండెక్సింగ్ చేయవద్దని గూగుల్‌కు తెలిపింది. యూజర్లు గ్రూప్ లింకులను పబ్లిక్ డొమైన్‌లో పంపవద్దని వాట్సాప్ కస్టమర్లకు సూచించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు వాట్సాప్ వెబ్ URL ఇండెక్సింగ్ వార్తలు వస్తున్నాయి. గత 24 గంటల్లో చాలా మంది వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్లకు లాగిన్ OTPలు వచ్చినట్లు తెలుస్తోంది. బయటి వ్యక్తులు వినియోగదారుల వాట్సాప్ చాట్ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ సమస్యపై వాట్సాప్ అధికారికంగా స్పందించలేదు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Information Technology, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు