వాట్సాప్‌లో స్టేటస్ ఆప్షన్‌కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఐతే వాట్సాప్‌లో మనం ఎవరిదైనా స్టేటస్ చూస్తే... మనం వాళ్ల స్టేటస్ చూసినట్లుగా వాళ్లకు తెలిసిపోతుంది. తద్వారా తమ స్టేటస్‌ను ఎవరెవరు చూస్తున్నారో వాళ్లకు అర్థమవుతుంది. ఐతే... ఇదే ఆప్షన్లో యూజర్లకు ప్రైవసీ కూడా ఇచ్చింది వాట్సాప్. తద్వారా స్టేటస్ చూసినా... ఆ విషయం అవతలి వాళ్లకు తెలియదు. దాన్నే స్టేటస్ ప్రైవసీ ట్రిక్ అంటున్నారు. ఇది ఎంతో మందికి నచ్చుతున్న ట్రిక్. ఈ ట్రిక్ గురించి తెలియాలంటే ముందుగా మీకు రెండు వాట్సాప్ ఫీచర్లపై ఐడియా ఉండాలి. అవి ఒకటి రీడ్ రిసీట్స్ అండ్ స్టేటస్.
రీడ్ రిసీట్స్ అంటే : ఏం లేదు... మీరు పంపిన మెసేజ్ అవతలి వాళ్లు చదివితే వెంటనే అక్కడ ఓ బ్లూకలర్ టిక్ ఏర్పడుతుంది కదా... అదే రీడ్ రిసీట్ అంటే. దీని ద్వారా... అవతలి వాళ్లు మీ మెసేజ్ చదివినట్లు మీకు అర్థమవుతుంది. ఈ ఆప్షన్‌ను మీరు డిజేబుల్ చేస్తే... మీరు ఎవరివైనా మెసేజ్‌లు చదివితే, అవతలి వాళ్లకు బ్లూకలర్ టిక్ ఏర్పడదు. తద్వారా మీరు మెసేజ్ చదివారా లేదా అన్నది వారికి అర్థం కాదు.
ఇక వాట్సాప్ స్టేటస్‌లో టెక్ట్స్, ఫొటోలు, వీడియోలు, యానిమేషన్ గిఫ్లు చూపించవచ్చు. అవి 24 గంటల తర్వాత కనిపించవు. సాధారణంగా మీ స్టేటస్... మీరు సేవ్ చేసిన కాంటాక్ట్స్‌కి మాత్రమే కనిపిస్తుంది. మీ స్టేటస్‌లోని పోస్టులు ఎవరికైనా కనిపించకూడదని మీరు భావిస్తే, అందుకు కూడా స్టేటస్‌లో ఆప్షన్ ఉంది.
స్టేటస్ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే : మీరు గనక ఎవరివైనా స్టేటస్లు చూస్తే... ఆ విషయం వాళ్లకు తెలియకూడదంటే... ముందు మీరు వాట్సాప్ లోని రీడ్ రిసీట్స్ (Read receipts) ఆప్షన్ని డిజేబుల్ చెయ్యాలి. ఆ తర్వాత స్టేటస్ చూసినా, ఆ విషయం అవతలి వాళ్లకు తెలియదు. ఐతే... రీడ్ రిసీట్స్ ఆప్షన్ డిజేబుల్ చేస్తే... మీ స్టేటస్‌ను ఎవరైనా చూశారా లేదా అన్నది కూడా మీకు తెలియదు.
వాట్సాప్ కొత్తగా చిన్న మార్పు చేసింది. అదేంటంటే... రీడ్ రిసీట్స్ ఆప్షన్ డిజేబుల్ చేసి... వాట్సాప్ స్టేటస్ చూసినవాళ్లు... తిరిగి రీడ్ రిసీట్స్ ఆప్షన్ ఆన్ చేస్తే... ఆ తర్వాత వాళ్లు స్టేటస్ చూడకపోయినా... అంతకు ముందు ఎవరి స్టేటస్ అయితే చూశారో వాళ్లకు... మీరు చూసినట్లుగా ఓ మెసేజ్ పంపిస్తుంది వాట్సాప్. అలా మెసేజ్ పంపకూడదని మీరు కోరుకుంటే... మీరు ఆ స్టేటస్ క్లోజ్ అయ్యేవరకూ... (అంటే 24 గంటలపాటూ) రీడ్ రిసీట్ని ఎనేబుల్ చెయ్యకూడదు. 24 గంటల తర్వాత ఆన్ చేసినా... వాట్సాప్ అవతలి వాళ్లకు మెసేజ్ పంపదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Information Technology, Technology, Whatsapp