హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Whatsapp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్లతో ఈ సమస్యలకు చెక్

Whatsapp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్లతో ఈ సమస్యలకు చెక్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Whatsapp new features: యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న వాట్సాప్.. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. యాప్‌ వాడుతున్న సమయంలో యూజర్‌కు వినూత్న అనుభూతి కలిగేలా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Whatsapp: యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న వాట్సాప్.. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. యాప్‌ వాడుతున్న సమయంలో యూజర్‌కు వినూత్న అనుభూతి కలిగేలా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా న్యూ టెక్ట్స్ ఎడిటర్ (Text Editor), న్యూ ఫాంట్స్ (New Fonts) తదితర అప్‌డేట్లను తీసుకొస్తోంది. వాట్సాప్ అప్‌డేట్ (Whatsapp New Features) ట్రాకర్ WAbetainfo తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఇవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. త్వరలోనే వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

రోజురోజుకు కొత్త అప్‌డేట్‌లతో యూజర్‌లను వాట్సప్ ఆకట్టుకుంటోంది. చాటింగ్, ఫైల్ షేరింగ్ వంటి విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఫీచర్లను యాడ్ చేస్తోంది. కానీ, ప్రస్తుతం వాట్సప్‌లో డిస్క్రిప్షన్ లిమిట్, ఇమేజ్ క్వాలిటీ తగ్గిపోవడం, గ్రూప్ సబ్జెక్ట్స్ టెక్ట్స్ లిమిట్ పరిమితంగా ఉండటం వంటి కొన్ని సమస్యలు యూజర్లకు చికాకు తెప్పిస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ సమస్యలు ఉండబోవని తెలుస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతూ వాట్సప్ సరికొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తోందని వాట్సప్‌బీటాఇన్ఫో వెల్లడించింది. మరి, వాట్సప్ తీసుకురానున్న ఆ సరికొత్త ఫీచర్లేంటో తెలుసుకుందాం.

* హై క్వాలిటీ ఇమేజెస్(High Quality Images)

ప్రస్తుతం వాట్సప్ ద్వారా ఇతరులకు ఫోటోలు పంపిస్తే ఇమేజ్ ఒరిజినల్ సైజ్ కుచించుకుపోతోంది. దీనివల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. కొందరు ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి డాక్యుమెంట్ రూపంలో ఫొటోలను షేర్ చేస్తుంటారు. అయితే, ఇక నుంచి ఈ సమస్య ఉండబోదు. నేరుగా హై క్వాలిటీ లేదా ఒరిజినల్ క్వాలిటీ ఇమేజ్‌లను ఇతరులకు సెండ్ చేయొచ్చు. ఇందుకు అనుగుణంగా ఇమేజ్ క్వాలిటీని ఎంచుకునే ఫీచర్‌ని వాట్సప్ అభివృద్ధి చేస్తోంది.

* క్యారెక్టర్స్ లిమిట్ పెంపు(Charecters Limit)

ప్రస్తుతం వాట్సప్ యూజర్లకు గ్రూప్ సబ్జెక్ట్స్ టెక్ట్స్ లిమిట్, డిస్క్రిప్షన్ లిమిట్ పరిమితంగానే ఉంది. డిస్క్రిప్షన్‌లో అత్యధికంగా 24 అక్షరాలు మాత్రమే ఎంటర్ చేయగలిగే సౌలభ్యం ఉంది. అంతకుమించి రాయాలనుకుంటే కుదరదు. ఈ సమస్యపై కూడా వాట్సప్ వర్క్ చేస్తున్నట్లు వాట్సప్‌బీటాఇన్ఫో తెలిపింది. క్యారెక్టర్స్ లిమిట్‌ని 100కు పెంచనుంది.

  • WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త వీడియో మోడ్‌.. వీడియో రికార్డింగ్ మరింత ఈజీ

* టెక్ట్స్ ఎడిటర్(Text Editor)

ఇతరులకు పంపించే మెసేజ్‌ని తమకు నచ్చిన విధంగా మార్చుకునే వీలును వాట్సప్ కల్పిస్తోంది. డ్రాయింగ్ టూల్‌‌లో కొత్త టెక్ట్స్ ఎడిటర్‌ ఫీచర్‌ని అభివృద్ధి చేస్తోంది. తద్వారా తమ అభిరుచికి అనుగుణంగా టెక్ట్స్‌ని డిజైన్ చేసుకుని ఇతరులకు సెండ్ చేయొచ్చు. ముఖ్యంగా డ్రాయింగ్ టూల్‌లో కొన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. త్వరగా టెక్ట్స్ ఫాంట్‌ని చేంజ్ చేయగలిగేలా ఫాంట్స్ ఫీచర్‌ని తీసుకొస్తోంది. అదే విధంగా టెక్ట్స్ అలైన్‌మెంట్(సెంటర్, లెఫ్ట్, రైట్) సౌలభ్యాన్ని కల్పించనుంది.

* న్యూ ఫాంట్స్(New Fonts)

వాట్సప్‌లో సరికొత్త ఫాంట్స్‌ని తీసుకు రానుంది. ఈ కొత్త ఫాంట్స్‌ని టెక్ట్స్ ఎడిటర్‌కి యాడ్ చేయనుంది. ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్‌లలోని టెక్ట్స్‌ని ఈ ఫీచర్‌తో యూజర్ ఎడిట్ చేసుకోవచ్చు. దీంతో పాటు వివిధ కలర్స్ కొత్త ఫాంట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాలిస్టోగా(Calistoga), కొరియర్ ప్రైమ్(Courier Prime), డామియోన్(Damion), ఎక్జో2(Exo 2), మార్నింగ్ బ్రీజ్(Morning Breeze) వంటి ఫాంట్‌లను యాప్‌లో యాడ్ చేయనున్నట్లు సమాచారం.

First published:

Tags: Technology, Whatsapp

ఉత్తమ కథలు