HOME »NEWS »TECHNOLOGY »whatsapp payment is live for 20 million users in india know here is how to transfer money ms gh

Whatsapp Payment: వాట్సాప్ కొత్త అప్డేట్.. నగదు బదిలీకి నాలుగు బ్యాంకులతో ఒప్పందం..

Whatsapp Payment: వాట్సాప్ కొత్త అప్డేట్.. నగదు బదిలీకి నాలుగు బ్యాంకులతో ఒప్పందం..
ప్రతీకాత్మక చిత్రం

Whatsapp Payment: ఇకపై వాట్సాప్ పే యూజర్లు యూపిఐతో కూడా నగదు చెల్లింపులు చేయవచ్చని వాట్సాప్ ప్రకటించింది. దీనికి గాను తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్(Axis Bank)లతో ఒప్పందం కుర్చుకుంది.

  • News18
  • Last Updated: December 22, 2020, 18:30 IST
  • Share this:
ఫేస్‌బుక్(Facebook) యాజమాన్యంలోని వాట్సాప్(WhatsApp) ఇటీవలే నగదు చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం భారతదేశంలోని 20 మిలియన్ల మంది వినియోగదారులకు అందుబాటులో ఉన్న వాట్సాప్ పేమెంట్ సేవలకు సంబంధించి సరికొత్త అప్డేట్తో ముందుకొచ్చింది. ఇకపై వాట్సాప్ పే యూజర్లు యూపిఐతో కూడా నగదు చెల్లింపులు చేయవచ్చని వాట్సాప్ ప్రకటించింది. దీనికి గాను తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్(Axis Bank)లతో ఒప్పందం కుర్చుకుంది. ఈ బ్యాంకింగ్ భాగస్వాముల సహకారంతో వాట్సాప్ యూపిఐ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

వాట్సాప్ పేమెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ)కి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సిస్టమ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనితో యూజర్లు వాట్సాప్ మెసేజెస్ చేస్తున్న విధంగానే సురక్షితంగా, సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. కాగా, ఈ కొత్త అప్డేట్ తో ప్రస్తుతం యూపిఐ నగదు బదిలీ సేవలు అందిస్తున్న పేటీఎం(Paytm), గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(PhonePe)కు గట్టిపోటీనివ్వాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది.



దీనిపై వాట్సాప్ హెడ్ అభిజిత్ బోస్ మాట్లాడుతూ ‘‘భారతదేశం అంతటా తమ వినియోగదారులకు సరళమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను తీసుకురావడానికి ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందిద. ఈ యూపిఐ (UPI )సేవలతో పెద్ద సంఖ్యలో వినియోగదారులను చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది.’’ అని తెలిపారు. కాగా, భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగం 2023 నాటికి "ఐదు రెట్లు" పెరుగుతుందని, తద్వారా 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) మార్కును తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. కాగా, 300 మిలియన్లకు పైగా వినియోగదారులతో ప్రస్తుతం వాట్సాప్ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది.

వాట్సాప్ పేమెంట్ ద్వారా నగదు బదిలీ విధానం..

  • స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్ను తెరవండి.

  • స్టెప్ 2: మీరు నగదు పంపించాలనుకుంటున్న అవతలి వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేయండి.

  • స్టెప్ 3: వారి చాట్‌లోకి వెళ్లి అటాచ్మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి.

  • స్టెప్ 4: యాక్సెప్ట్, కంటిన్యూ ఆప్షన్లపై క్లిక్ చేయండి.

  • స్టెప్ 5: జాబితాలోని మీ బ్యాంకు పేరును ఎంచుకోండి.

  • స్టెప్ 6: ‘SMS వెరిఫికేషన్’ ఆప్షన్ను ఎంచుకోండి.

  • స్టెప్ 7: SMS ద్వారా మీ ఫోన్‌లో వెరిఫికేషన్ కోడ్‌ను అందుకుంటారు.

  • స్టెప్ 8: మీ రిజిస్టర్డ్ నంబర్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ప్రదర్శించబడుతుంది.

  • స్టెప్ 9: మీరు ట్రాన్స్ఫర్ చేసే మొత్తం అమౌంట్ను ఎంటర్ చేయండి.

  • స్టెప్ 10: మీ ట్రాన్సాక్షన్ను ధృవీకరించడానికి మీ బ్యాంకు యుపిఐ పిన్ నెంబర్ను ఎంటర్ చేయండి. తద్వారా మీ పేమెంట్ ప్రాసెస్ చేయబడుతుంది. దీని తరువాత, మీ వాట్సాప్ చాట్ మెసేజ్ బాక్స్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసిన మొత్తం అమౌంట్ను చూసుకోవచ్చు.

Published by:Srinivas Munigala
First published:December 22, 2020, 18:25 IST