WHATSAPP OVER 20 LAKH WHATSAPP ACCOUNTS BANNED IN INDIA DO YOU KNOW THE REASON GH EVK
WhatsApp: భారత్‌లో 20 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp: అక్టోబర్ నెలలో 20 లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది వాట్సాప్. సెప్టెంబర్‌లో సుమారు 30 లక్షల ఖాతాలను తొలగించింది. ఇలా నెలకు 20, 30 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. ఇందుకు గల కారణాలను తెలుసుకోండి. ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాట్సాప్‌ను ప్రతిరోజూ వాడుతుంటారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ (WhatsApp) తో సహవాసం చేస్తుంటారు. ఒక్క రోజు వాట్సాప్ సేవలు నిలిచిపోయినా ఎంతో ఫీలవుతుంటారు. ఈ స్థాయిలో ప్రజల జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్ అకౌంట్ (Account) బ్యాన్ అయితే.. ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇలాంటి చేదు అనుభవం ఇటీవల కొంత మంది యూజర్ల (Users)కు ఎదురైంది. అక్టోబర్ నెలలో 20 లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది వాట్సాప్. సెప్టెంబర్‌లో సుమారు 30 లక్షల ఖాతాలను తొలగించింది. ఇలా నెలకు 20, 30 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే బ్యాన్ అయిన మొత్తం అకౌంట్ల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది. వీటిలో 30.27 లక్షల ఖాతాలు భారతీయులవే కావడం గమనార్హం.
డిజిటల్ మీడియా (Digital Media) ఎథిక్స్ కోడ్‌లోని కొత్త ఐటీ నియమాల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ యూజర్ల యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని అకౌంట్లను నిషేధించినట్లు పేర్కొంది. అయితే, వాట్సాప్ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ ద్వారా సేఫ్టీగా ఉన్నప్పటికీ మీ డేటాను వాట్సాప్ యాజమాన్యం ట్రాక్ చేస్తుంది. కాబట్టి, యూజర్లు తమ “సేవా నిబంధనలను” ఉల్లంఘించినట్లు కనుగొంటే, ఖాతాలను నిషేధిస్తామని స్పష్టంగా పేర్కొంది. వాట్సాప్ “సర్వీస్ నిబంధనల” (Service Rules) ప్రకారం, ఈ 8 పనులను చేయడం వల్ల ఖాతాలు బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
మరొకరి పేరుతో నకిలీ ఖాతాను సృష్టించడం
వాట్సాప్‌లో కొంత మంది మరొకరి పేరుతో నకిలీ ఖాతా (Fake Account) లను సృష్టిస్తున్నారు, దీని ద్వారా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసిన వారి అకౌంట్లను గుర్తించి బ్యాన్ చేస్తుంది.
కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తికి ఎక్కువ మెసేజ్‌లు పంపడం
మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్‌కు పదే పదే మెసేజ్‌లు పంపడం వల్ల కూడా వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులను స్పామ్ చేస్తే, వాట్సాప్ మీ ఖాతాను నిషేధిస్తుంది. అంతేకాదు, బల్క్ మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ వంటివి చేస్తే వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది.
వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం
కొంత మంది వాట్సాప్ థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్స్ ద్వారా ఇతరుల వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసి వారి చాటింగ్ హిస్టరీని తెలుసుకుంటున్నారు. ఇది వ్యక్తిగత గోప్యత (Privacy)కు వ్యతిరేకం. కాబట్టి, వాట్సాప్ ఆయా అకౌంట్లను బ్యాన్ చేస్తుంది.
ఎక్కువ మంది యూజర్లు మీ అకౌంట్‌ను బ్లాక్ చేయడం
వివిధ కారణాలతో మీ స్నేహితులు లేదా తెలిసిన వారు మీ అకౌంట్‌ను బ్లాక్ చేస్తుంటారు. అయితే, ఇలా ఎక్కువ మంది మీ అకౌంట్‌ను బ్లాక్ చేస్తే, ఆ వ్యక్తులు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా వాట్సాప్ మిమ్మల్ని నిషేధించవచ్చు.
మీ వాట్సాప్ ఖాతాకు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేయడం
మీ వాట్సాప్ ఖాతాకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తే వాట్సాప్ మీ అకౌంట్‌పై బ్యాన్ విధించే అవకాశం ఉంది.
ఇతర యూజర్లకు మాల్వేర్ లేదా ఫిషింగ్ లింక్‌లను పంపించడం
మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి APK ఫైల్ల రూపంలో మాల్వేర్ను పంపితే లేదా ప్రమాదకరమైన ఫిషింగ్ లింక్స్‌ను యూజర్లకు ఫార్వర్డ్ చేస్తే, వాట్సాప్ మీ అకౌంట్‌పై బ్యాన్ విధించే అవకాశం ఉంది.
వాట్సాప్‌లో పోర్న్ క్లిప్‌లు, పరువు నష్టం కలిగించే మెసేజ్‌లు పంపించడం
మీ వాట్సాప్ నుంచి ఇతరులకు చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన, పరువు నష్టం కలిగించే, వేధించడం, ద్వేషపూరిత సందేశాలు పంపిస్తే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.
వాట్సాప్‌లో హింసను ప్రోత్సహించే నకిలీ సందేశాలు లేదా వీడియోలను పంపించడం నేరాలను ప్రోత్సహించడం, హింసాత్మక వీడియోలను షేర్ చేస్తే మీ వాట్సాప్ అకౌంట్‌ను బ్యాన్ చేసే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.