వాట్సప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా?

ఇండియా కోసం ఓ ఫిర్యాదుల అధికారిని నియమించింది వాట్సప్. ఈ మెసేజింగ్ సర్వీస్‌లో ఏ సమస్య ఉన్నా ఇకపై నేరుగా కంప్లైంట్ ఇవ్వొచ్చు.

news18-telugu
Updated: September 26, 2018, 6:46 PM IST
వాట్సప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా?
image: Tech2/Nandini Yadav
  • Share this:
భారతదేశంలో వాట్సప్‌లో వైరల్‌గా మారిన ఫోటోలు, వీడియోలు, సమాచారం అనేక దాడులకు, మూకహత్యలకు కారణమవుతున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టాలని వాట్సప్‌‌పై ఒత్తిడి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. యాప్‌లో కొన్ని మార్పులు చేయడంతో పాటు పత్రికలు, రేడియోల ద్వారా ప్రచారం చేస్తోంది వాట్సప్. చివరకు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఓ ఫిర్యాదుల అధికారిని నియమించింది ఆ కంపెనీ. ఆ అధికారి పేరు కోమల్ లాహిరి. ఆమె వాట్సప్‌లో గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్, లోకలైజేషన్‌లో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇండియాకు హెడ్ అయినా... పనిచేసేది మాత్రం అమెరికాలోనే. ఎవరైనా ఆమెకు ఫిర్యాదు చేయొచ్చు.

వాట్సప్ యాప్ ద్వారా, ఇమెయిల్ ద్వారా, లేదా నేరుగా లేఖ రాసి ఫిర్యాదుల అధికారికి కంప్లైంట్ ఇవ్వొచ్చు. మీరు మెసెంజర్ విషయంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నా, అభ్యంతరకర సందేశాలు అందుకున్నా ఫిర్యాదులు పంపొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

యాప్ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలి?
వాట్సప్ మెసెంజర్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయడం చాలా సులువు. వాట్సప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్... హెల్ప్... కాంటాక్ట్ అజ్‌లోకి వెళ్లాలి. ఇండియాలో ఈ పేజ్ అందరికీ కనిపిస్తోంది. మీ ఫిర్యాదును అందులో నమోదు చేయాలి. ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు.

WHATSAPP, NEW FEATURES, komal lahari, complaints, వాట్సప్, కొత్త ఫీచర్లు, కోమల్ లహరి, కంప్లైంట్స్, ఫిర్యాదులు
screenshot


మెయిల్ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలి?
ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేయాలంటే grievance_officer_wa@support.whatsapp.com అడ్రస్‌కు మెయిల్ పంపొచ్చు. అయితే ఇమెయిల్ కంప్లైంట్‌కు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ తప్పనిసరి. ఇందుకోసం మీరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో DocuSign, Adobe Sign లాంటి యాప్స్ ఉన్నాయి. దాంతో పాటు మీ ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్‌తో ఉండాలి.(ఉదాహరణ: +91 916xxxxxx0)పోస్ట్ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలి?
మీరు ఒకవేళ లేఖ ద్వారా కంప్లైంట్ చేయాలనుకుంటే మీ ఫిర్యాదు పత్రాన్ని ఈ కింది అడ్రస్‌కు పంపాలి.
కోమల్ లహరి,
వాట్సప్ ఐఎన్‌సీ,
అటెన్షన్: గ్రీవెన్స్ ఆఫీసర్
1601 విల్లో రోడ్,
మెన్‌లో పార్క్, కాలిఫోర్నియా 94025,
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

వాట్సప్‌లో మిమ్మల్ని ఇబ్బందిపెట్టే, ఆందోళనకు గురిచేసే, భయపెట్టే సమాచారం ఏదొచ్చినా ధైర్యంగా ఫిర్యాదు చేయండి.

ఇవి కూడా చదవండి:

ఫేక్‌న్యూస్‌పై పోరాటానికి జియోతో చేతులు కలిపిన వాట్సప్

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్ చూశారా?

వాట్సప్‌లో అభ్యంతరకర పోస్ట్ వస్తే మీరేం చేయాలంటే..!

మీ వాట్సప్‌లో ఈ ఫీచర్ ఉందా?

మీ వాట్సప్ హ్యాక్ అయిందా?

మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!

వాట్సప్‌లో మూడు కొత్త ఫీచర్స్!

ఆ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు!
First published: September 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading