WhatsApp: జుకర్ బర్గ్ మామా థాంక్యూ.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. నెటిజన్లు ఫిదా

వాట్సాప్ నోటిఫికేషన్లను పర్మినెంట్‌గా మ్యూట్ చేసే ఫీచర్‌ను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.

news18-telugu
Updated: October 23, 2020, 6:32 PM IST
WhatsApp: జుకర్ బర్గ్ మామా థాంక్యూ.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. నెటిజన్లు ఫిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
WhatsApp Mute Forever Option: వాట్సప్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్‍స్టంట్ మెసేజింగ్ యాప్. ఈ యాప్ వల్ల యూజర్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని చికాకులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి నోటిఫికేషన్. వాట్సప్‌లో ఎవరైనా మెసేజ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. కానీ వాట్సప్‌లో గ్రూప్స్ పెరిగిపోవడంతో నిమిషానికో మెసేజ్ వస్తుంటుంది. ఎక్కువగా మెసేజెస్ రావడం వల్ల ముఖ్యమైన మెసేజెస్ మిస్ అవుతుంటారు యూజర్లు. ఈ సమస్య అందరికీ మామూలే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సప్ మ్యూట్ ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే గ్రూప్స్ లేదా ఛాట్స్‌లో అవసరంలేనివి, అంతముఖ్యమైనవి కానివి ఉంటే మ్యూట్ చేయొచ్చు. 8 గంటలు, 1 రోజు, 1 ఏడాది వరకు మ్యూట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది వాట్సప్. ఈ ఫీచర్‌ని యూజర్లు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. మ్యూట్ ఫీచర్‌కు మరింత మెరుగులు దిద్దింది వాట్సప్. అవసరం లేని ఛాట్స్ నుంచి వచ్చే మెసేజెస్‌కు సంబంధించిన నోటిఫికేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేసే ఫీచర్‌ను రూపొందించింది వాట్సప్. ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు టెస్ట్ చేయడం పూర్తైంది. ఇక అందరు యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేస్తోంది. మీరు ఈ ఫీచర్ ఉపయోగించాలంటే ముందుగా మీ యాప్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా ఛాట్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు 8 గంటలు, 1 రోజుతో పాటు మ్యూట్ ఆల్వేస్ ఆప్షన్ కనిపిస్తుంది. మ్యూట్ ఆల్వేస్ సెలెక్ట్ చేస్తే ఇక ఆ గ్రూప్ లేదా ఛాట్‌కు సంబంధించిన మెసేజ్ నోటిఫికేషన్స్ రావు. ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఓఎస్ యూజర్లు మ్యూట్ ఆల్వేస్ ఫీచర్ వాడుకోవచ్చు. యాప్ అప్‌డేట్ చేస్తేనే ఈ ఫీచర్ కనిపిస్తుంది. వెబ్ వర్షన్‌లో కూడా ఈ ఫీచర్ ఉంది. ఇక ఈ ఫీచర్‌తో పాటు 'వెకేషన్ మోడ్' ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది వాట్సప్. అంటే సెలవుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని రోజులపాటు వాట్సప్ ఉపయోగించకూడదు అనుకుంటే ఈ ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు.



ఫేస్ బుక్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘హమ్మయ్య. ఇక నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మొత్తానికి 2020లో ఓ గుడ్ న్యూస్ వచ్చింది.’ అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.





ఇలాంటి అద్భుతమైన కొత్త ఫీచర్ తెచ్చినందుకు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు థాంక్స్ చెబుతున్నారు.







మొత్తానికి వాట్సాప్‌లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌లు పెట్టే వారికి, ప్రతిసారీ ఇబ్బంది పెట్టే వాట్సాప్ గ్రూపుల్లో ఉండే వారికి ఇదో గుడ్ న్యూస్. ఇలాంటి ఫీచర్‌ ఎప్పటి నుంచి వస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అందుబాటులోకి రావడంతో వారు ఖుషీ అవుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2020, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading