WHATSAPP NIGHT MODE EXPECTED TO RELEASE SOON TO ALL USERS SS
WhatsApp: వాట్సప్‌లో నైట్ మోడ్ ఎలా ఉందో చూశారా?
WhatsApp: వాట్సప్‌లో నైట్ మోడ్ ఎలా ఉందో చూశారా?
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Dark Mode | వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ ఇలా ఉందంటూ కొన్ని ఫోటోలు లీకయ్యాయి. మార్పుచేర్పులన్నీ పూర్తైన తర్వాత వీలైనంత త్వరలోనే డార్క్ మోడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా.
వాట్సప్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నైట్ మోడ్ ఫీచర్ త్వరలో వచ్చేస్తోంది. నైట్ మోడ్ ఫీచర్‌పై చాలాకాలంగా కసరత్తు చేస్తోంది వాట్సప్. ఇప్పటికే చాలా యాప్స్‌లో డార్క్ మోడ్(Night Mode) ఉంది. కానీ యూజర్లకు నైట్ మోడ్ అందించే విషయంలో వాట్సప్ చాలా ఆలస్యం చేసిందనే చెప్పాలి. యూజర్ల నుంచి డిమాండ్ పెరగడంతో నైట్ మోడ్ ఫీచర్ రూపొందిస్తోంది వాట్సప్. కొద్దిరోజుల క్రితమే 2.19.139 బీటా వర్షన్ ఉపయోగిస్తున్న బీటా యూజర్లకు నైట్ మోడ్ ఫీచర్ లభించింది. అది కూడా స్టేటస్, కాల్స్ పేజీల్లోనే ఈ ఫీచర్ కనిపించింది. ఇప్పుడు మరిన్ని మార్పులు చేస్తోంది వాట్సప్. ఆ తర్వాత యూజర్లకు డార్క్ మోడ్ ఫీచర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
వాట్సప్ 2.19.145 బీటా వర్షన్లో డార్క్ మోడ్ మరిన్ని సెక్షన్స్‌లో కనిపించింది. కాంటాక్ట్ పిక్కర్ సెక్షన్, కాంటాక్ట్ ఇన్ఫో పేజ్, గ్రూప్ ఇన్ఫో సెక్షన్లో డార్క్ మోడ్ ఫీచర్ ఇలా ఉందంటూ కొన్ని ఫోటోలు లీకయ్యాయి. మార్పుచేర్పులన్నీ పూర్తైన తర్వాత వీలైనంత త్వరలోనే డార్క్ మోడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా. అయితే యూజర్లందరికీ డార్క్ మోడ్ ఎప్పుడు వస్తుందని వాట్సప్ మాత్రం వెల్లడించలేదు. త్వరలో 155 ఎమొజీలు రీడిజైన్ చేసి అప్డేట్ రిలీజ్ చేయనుంది వాట్సప్.