Whatsapp : వాట్సాప్‌లో అదిరే కొత్త ఫీచర్...

Whatsapp New Status Feature : వాట్సాప్‌ని నిర్వహించే ఫేస్‌బుక్ యాజమాన్యం దాని సేవల్ని మరింత ఉపయోగించుకునేందుకు తెలివైన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మళ్లీ ఫేస్‌బుక్ వాడకం పెరిగే అవకాశాలున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 5:29 AM IST
Whatsapp : వాట్సాప్‌లో అదిరే కొత్త ఫీచర్...
వాట్సాప్‌లో అదిరే కొత్త ఫీచర్...
  • Share this:
Whatsapp New Status Feature : మీరు గమనిస్తున్నారో లేదో... ఈమధ్య వాట్సాప్‌లో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఫీచర్ అందరికీ నచ్చేస్తోంది. ఏంటంటే... ఇప్పటివరకూ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టే అప్‌డేట్స్‌ని ఫ్రెండ్స్ చూడగలిగేవారు, కామెంట్స్ చేసేవారు. అలాగే యూజర్లు కూడా తమ స్టేటస్‌ను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలపగలిగేవారు. ఇకపై వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి డైరెక్టుగా షేర్ చెయ్యవచ్చు. తద్వారా... వాట్సాప్‌లో టచ్‌లో లేని ఫ్రెండ్స్... ఫేస్‌బుక్ ద్వారా మన అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు అందరూ వాడుకోవచ్చు.

షేర్ చెయ్యడం ఎలా?

- ముందుగా వాట్సాప్ స్టేటస్ లోకి వెళ్లాలి.
- స్టేటస్ (ఫొటో లేదా వీడియో) అప్‌డేట్ చేసుకోవాలి.
- ఇప్పుడు కుడివైపు ఉండే మూడు చుక్కల్ని క్లిక్ చెయ్యాలి.
- షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది.
- షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ బటన్‌పై క్లిక్ చెయ్యాలి.- ఇప్పుడు మీ స్టేటస్... ఫేస్‌బుక్‌లో స్టోరీగా షేర్ అవుతుంది.
- ఇందుకోసం మీరు మొబైల్‌లో ఫేస్‌బుక్ లాగిన్ అయి ఉండాలి.

మరో కొత్త ఫీచర్ : ఇప్పటివరకూ వాట్సాప్‌లో కొందరి స్టేటస్‌లు చూడకూడదు అనుకుంటే వాటిని మ్యూట్ చేసుకునే సదుపాయం ఉంది కదా. ఐతే... మ్యూట్ చేసిన స్టేటస్‌లు... పూర్తిగా పోకుండా... బ్లర్‌గా బూడిద రంగులో లైట్‌గా కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఆప్షన్‌పై వాట్సాప్ దృష్టిసారిస్తోంది. మ్యూట్ చేసిన స్టేటస్‌లు పూర్తిగా కనిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Published by: Krishna Kumar N
First published: September 24, 2019, 5:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading