WhatsApp: ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)కుఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజుకో కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తూ మోస్ట్ పాపులర్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే వాట్సాప్‌కు వెబ్ యూజర్ల (Whatsapp web users) కంటే మొబైల్ యూజర్ల సంఖ్యే ఎక్కువ. అందువల్ల ఇటీవలి కాలంలో వెబ్ యూజర్ల సంఖ్యను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వాట్సాప్ తన డెస్క్‌టాప్ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే వాట్సాప్ వెబ్ గ్రూప్‌లో మ్యూట్ షార్ట్‌కట్ అనే కొత్త ఆప్షన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ లేటెస్ట్ అప్డేట్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
YouTube: మూడు నెలల్లో 17 లక్షలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
ముందుగా మొబైల్ వెర్షన్లో లాంచ్
ముందుగా మ్యూట్ షార్ట్‌కట్ ఫీచర్‌ను మొబైల్ వెర్షన్ యూజర్లకు వాట్సాప్ పరిచయం చేయనుంది. ఆ తర్వాత దానికి కొత్త ఫీచర్లు జోడించి డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవలి కాలంలో వాట్సాప్ ప్రతి రోజూ ఏదో ఒక కొత్త ఫీచర్ లేదా టూల్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే, 'మెసేజ్ యువర్ సెల్ఫ్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది క్రమంగా భారతదేశంతో పాటు ఇతర దేశాలలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వాట్సాప్ దాని డెస్క్‌టాప్ యూజర్లకు సంబంధించిన ఫీచర్లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే డెస్క్‌టాప్ యాప్‌లోని గ్రూప్‌ల కోసం ‘మ్యూట్ షార్ట్‌కట్’ ఆప్షన్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.
ఈ షార్ట్‌కట్ బటన్ గ్రూప్ చాట్ల పైన కనిపిస్తుంది. యూజర్లు తాము మ్యూట్ చేసిన గ్రూప్‌ల నుంచి వచ్చేనోటిఫికేషన్లను నిలిపివేయడానికి ఈ కొత్త ఫీచర్ అనుమతిస్తుంది.
కాగా, వాట్సాప్‌లోని ఒక గ్రూప్‌లో గరిష్టంగా 1024 మంది మెంబర్స్ చేరవచ్చు. అయితే తరచూ ఏదో ఒక మెసేజ్ వస్తుండటంతో అనేక మంది అసహనానికి గురవుతారు. అటువంటి వారు, గ్రూప్ మ్యూట్ ఆప్షన్ ద్వారా ఆయా మెసేజ్‌లను మ్యూట్ చేయవచ్చు. వాట్సాప్ రెండు వారాల క్రితం ఇదే ఫీచర్‌ను తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తీసుకువచ్చింది. త్వరలోనే ఇది డెస్క్‌టాప్ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది.
‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్‌కు మంచి స్పందన
వాట్సాప్ గ్రూప్ అనేది వాట్సాప్‌లో అంతర్భాగం. ట్రిప్ ప్లాన్ చేయడానికి లేదా సర్ ప్రైజ్ పార్టీ కోసం లేదా అందరికీ ఒకేసారి మెసేజ్ పంపడం కోసం గ్రూప్ చాట్ ఉపయోగిస్తారు. కాగా త్వరలోనే వాట్సాప్ తన డెస్క్‌టాప్ యూజర్ల కోసం ‘కాల్స్ ట్యాబ్’ను కూడా యాడ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. మరోవైపు వాట్సాప్ ఇటీవల రిలీజ్ చేసిన మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌కు మంచి స్పందన వస్తోంది. వాట్సాప్ ద్వారా ఇప్పటివరకు ఇతర కాంటాక్టులకు మాత్రమే మెసేజ్ పంపించుకునే అవకాశం ఉండేది. అయితే ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్ ద్వారా ముఖ్యమైన మెసేజ్‌లను తమకు తాముగా పంపుకొని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నోట్స్, ఫైల్స్ దాచుకునేందుకు ఈ ఫీచర్‌ని వాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Whatsapp