WhatsApp: బీ రెడీ... వాట్సప్‌లో రాబోతున్న 5 కొత్త ఫీచర్స్ ఇవే

WhatsApp: బీ రెడీ... వాట్సప్‌లో రాబోతున్న 5 కొత్త ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Upcoming Features | మీరు వాట్సప్ వాడుతున్నారా? గుడ్ న్యూస్. త్వరలో 5 కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

  • Share this:
    వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. మరిన్ని అద్భుతమైన ఫీచర్స్ వాట్సప్‌లో రాబోతున్నాయి. వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వాట్సప్ వాడేవారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫీచర్స్‌ని రూపొందిస్తూ ఉంటుంది వాట్సప్. ఈ ఫీచర్స్ యూజర్లను బాగా ఆకట్టుకుంటాయి కూడా. అలాంటి మరిన్ని ఫీచర్స్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. మల్టీ డివైజ్ సపోర్ట్, మిస్డ్ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మరి ఏ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

    View Once: వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలతో మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోతుందా? త్వరలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. వ్యూ వన్స్ ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్‌తో మీరు ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేయకుండా ఒకసారి చూస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

    OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

    iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

    Read Later: రీడ్ లేటర్ ఫీచర్‌ను కూడా తీసుకురాబోతోంది వాట్సప్. ముఖ్యమైనవి కాని మెసేజెస్, ఛాట్స్‌ని మీకు వీలైనప్పుడు చదవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

    Missed group calls: గ్రూప్ కాల్స్ మిస్ అయ్యారా? మిస్డ్ గ్రూప్ కాల్ ఫీచర్‌తో ఆ గ్రూప్ కాల్స్‌లో జాయిన్ కావొచ్చు. ప్రస్తుతం గ్రూప్ కాల్ వచ్చినప్పుడు జాయిన్ కాకపోతే ఆ తర్వాత చేరడానికి వీల్లేదు.

    Realme Narzo 30: రియల్‌మీ మరో సంచలనం... ధర రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్

    Jio 4G Data Plans: మొబైల్ డేటా ఎక్కువ కావాలా? జియో అందిస్తున్న12 డేటా ప్లాన్స్ ఇవే

    Multiple device support: మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను రెండుమూడు నెలలుగా పరీక్షిస్తోంది వాట్సప్. అయితే ఈ ఫీచర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని వాట్సప్ ప్రకటించింది. ఒకట్రెండు నెలల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో మీరు ఒకే వాట్సప్ అకౌంట్‌ను వేర్వేరు డివైజ్‌లల్లో లాగిన్ కావొచ్చు.

    Disappearing mode: వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రూప్స్‌కి మాత్రమే ఈ ఫీచర్ ఉంది. త్వరలో అన్ని ఛాట్ థ్రెడ్స్‌కి ఈ ఫీచర్ తీసుకురానుంది వాట్సప్. అంటే ప్రతీ ఛాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: