హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్స‌ప్‌లో అదిరిపోయే కొత్త ఫీచ‌ర్స్‌.. తెలుసుకొని ట్రై చేయండి

WhatsApp: వాట్స‌ప్‌లో అదిరిపోయే కొత్త ఫీచ‌ర్స్‌.. తెలుసుకొని ట్రై చేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం కమ్యూనిటీ ట్యాబ్, 2జీబీ వరకు ఫైల్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్లు, డ్రాయింగ్ టూల్స్ వంటి చాలా ఫీచర్లను తీసుకొస్తోంది. అయితే ఇది ఇప్పుడు మరొక అదిరిపోయే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అయింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్రస్తుతం కమ్యూనిటీ ట్యాబ్, 2జీబీ వరకు ఫైల్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్లు, డ్రాయింగ్ టూల్స్ వంటి చాలా ఫీచర్లను తీసుకొస్తోంది. అయితే ఇది ఇప్పుడు మరొక అదిరిపోయే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ ఫీచర్(Feature) ఏంటి, అదెలా పని చేస్తుంది వంటి వివరాలను వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) లేటెస్ట్ రిపోర్ట్(Latest Report) తెలిపింది. స్పెసిఫిక్ కాంటాక్ట్స్ (Specific Contacts) కోసం యూజర్లు తమ “లాస్ట్ సీన్ (Last Seen)” స్టేటస్ ని హైడ్ చేయగల ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన లేటెస్ట్ వాట్సాప్ బీటా రిలీజ్ లో ఈ ఫీచర్ కనిపించినట్లు ఇది వెల్లడించింది.

Gamming Smart Phone: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కావాలా.. ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లోకి పోకో స్మార్ట్ ఫోన్


ఆన్‌లైన్‌ స్టేటస్‌కు సంబంధించిన ఈ ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు తమ ‘లాస్ట్ సీన్’ స్టేటస్‌ను తమకు నచ్చిన వారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం వీడియోలు, ఇంకా ఇతర ఏదైనా ఫైల్ ని వాట్సాప్ లోని స్టేటస్ (Status)లో షేర్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో స్టేటస్ ప్రైవసీ (Status Privacy) అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ తో మనకు కావాల్సిన కాంటాక్ట్‌లకు మాత్రమే మన స్టేటస్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ సీన్ విషయంలో కూడా ఇదే ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేస్తోంది.

ఈ ఫీచర్ యాప్ లోని ప్రైవసీ (Privacy) సెట్టింగ్స్‌లో ఉంటుంది. యూజర్లు ప్రైవసీ సెక్షన్‌లో “లాస్ట్ సీన్” కేటగిరీకి వెళ్లి అక్కడ ఎవ్రీవన్ (Everyone)... మై కాంటాక్ట్స్ (My Contacts)... నోబడి (Nobody)... మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌ (My Contacts Except) అనే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీవన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అందరికీ మీ లాస్ట్ సీన్ కనిపిస్తోంది. మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్స్ కి తప్ప మీ లాస్ట్ సీన్ ఎవరికీ కనిపించదు.

Tech Tips: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితేఈ మిస్టేక్ చేయకుండా ఉండండి


మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌ అనే ఆప్షన్ ఎంచుకుంటే మీరు సెలెక్ట్ చేసిన వారు తప్ప కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికి మీ లాస్ట్ సీన్ కనిపిస్తుంది. అయితే మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌ ఆప్షన్ ఎన్నుకుంటే మీరు సెలెక్ట్ చేసిన వారి లాస్ట్ సీన్ మీకు కూడా కనిపించదు.

వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్స్ (Profile Pictures), అబౌట్ (About) సెక్షన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌నే ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్స్ ఎవరు చూడవచ్చో నిర్ణయించుకోవచ్చు. రిపోర్ట్ ప్రకారం, మీరు వాట్సాప్ సెట్టింగ్స్> అకౌంట్> ప్రైవసీ> లాస్ట్ సీన్ / ప్రొఫైల్ ఫొటో / అబౌట్ ఓపెన్ చేస్తే... మీకు ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌…’ వంటి అనే కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ కొత్త ఆప్షన్లతో యూజర్లు తమ వాట్సాప్ వివరాలను మరింత ప్రైవేటుగా ఉంచుకోవచ్చు.

First published:

Tags: Latest Technology, Whatsapp

ఉత్తమ కథలు