HOME »NEWS »TECHNOLOGY »whatsapp new features dark mode frequently forwarded fingerprint lock and many more new features will release soon ss

WhatsApp: వాట్సప్‌లో వచ్చేస్తున్న కొత్త ఫీచర్స్ ఇవే...

WhatsApp: వాట్సప్‌లో వచ్చేస్తున్న కొత్త ఫీచర్స్ ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp new features | ఎవరి స్టేటస్‌లు నచ్చట్లేదో వారి స్టేటస్ హైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ కావాలంటే 'షో' ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

  • Share this:
    వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం వాట్సప్ ప్రత్యేకత. ఇప్పటికీ మరిన్ని కొత్త ఫీచర్స్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సప్. వాటిని యూజర్లకు రిలీజ్ చేయనుంది. అందులో ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్, హైడ్ మ్యూటెడ్ స్టేటస్, డార్క్ మోడ్ ఇలా కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. వీటిని మొదట బీటా యూజర్లకు రిలీజ్ చేసింది వాట్సప్. వాటిని పరిశీలించిన తర్వాత మార్పుచేర్పులు చేసి మిగతా యూజర్లకు అందించనుంది. రాబోయే రోజుల్లో యూజర్లను ఆకట్టుకోనున్న ఈ కొత్త ఫీచర్లేంటీ? వాటితో ఉపయోగాలేంటీ? తెలుసుకోండి.

    Frequently Forwarded: ఇటీవల ఇండియాలో ఫేక్ న్యూస్ పెద్ద సమస్యగా మారిపోయింది. వైరల్ మెసేజెస్ తరచూ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఒకే మెసేజ్ కొన్ని నెలల పాటు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇకపై అలాంటి మెసేజెస్‌ను సులువుగా గుర్తించొచ్చు. అందుకోసమే ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ ఫీచర్ తీసుకొస్తోంది వాట్సప్. ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయిందో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక మెసేజ్ నాలుగు సార్ల కన్నా ఎక్కువ ఫార్వర్డ్ అయినట్టైతే దాన్ని 'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్' మెసేజ్‌గా భావిస్తారు. ప్రస్తుతం ఇండియాలో ఒక మెసేజ్‌ను ఐదుగురికన్నా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయలేరు.



    Hide Muted Status: మీకు వాట్సప్‌లో ఎవరివైనా స్టేటస్‌లు నచ్చట్లేదా? అలాంటి స్టేటస్‌లను మ్యూట్ చేసే ఆప్షన్ ప్రస్తుతం ఉంది. ఇలా కాకుండా మొత్తానికే స్టేటస్‌ను హైడ్ చేసే ఫీచర్ త్వరలో రాబోతోంది. అదే హైడ్ మ్యూడెట్ స్టేటస్. ఈ ఫీచర్ వస్తే ఎవరి స్టేటస్‌లు నచ్చట్లేదో వారి స్టేటస్ హైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ కావాలంటే 'షో' ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

    Dark Mode: డార్క్ మోడ్... చాలాకాలంగా వాట్సప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్. ఇప్పటికే అనేక యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. కొంతకాలంగా బీటా యూజర్లు డార్క్ మోడ్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ఫీచర్ యూజర్లందరికీ రానుంది.

    Share WhatsApp status: మీ వాట్సప్ స్టేటస్‌ను డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ స్టోరీస్‌గా మార్చేయొచ్చు. ఇందుకోసం షేర్ వాట్సప్ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడనుంది. మీరు మీ వాట్సప్‌లో ఏదైనా స్టేటస్ పెడితే... అదే స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి షేర్ చేయొచ్చు.

    WhatsApp Fingerprint Lock: లాక్ చేసిన వాట్సప్‌ని ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్, ప్యాటర్న్ తప్పనిసరి. ఫింగర్‌ప్రింట్ ద్వారా వాట్సప్ ఓపెన్ చేసే ఫీచర్‌ త్వరలో రానుంది. మీరు సెక్యూరిటీ లాక్ సెట్ చేసుకున్నా, మీ ఫింగర్‌ప్రింట్‌తో వాట్సప్ అన్‌లాక్ చేయొచ్చు.

    Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Mobile App: మీరు కొనే వస్తువులు ఒరిజినలా? నకిలీవా? ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు

    ICICI: వడ్డీ లేకుండా అప్పు... ఐసీఐసీఐ నుంచి ఆఫర్

    WhatsApp: వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాలా... ఇందులో నిజమెంత?
    Published by:Santhosh Kumar S
    First published:July 08, 2019, 16:31 IST

    टॉप स्टोरीज