WhatsApp: వాట్సప్‌లో స్టేటస్ నచ్చలేదా? ఈ ఫీచర్ వాడుకోవచ్చు

WhatsApp Hide Status Feature | మీరు ఎవరి స్టేటస్ నచ్చట్లేదో వారి స్టేటస్‌లు ఇక లిస్ట్‌లో కనిపించకుండా చేయొచ్చు. నచ్చనివారి స్టేటస్‌ని శాశ్వతంగా హైడ్ చేసే ఫీచర్‌ని అందించబోతోంది వాట్సప్.

news18-telugu
Updated: June 27, 2019, 12:42 PM IST
WhatsApp: వాట్సప్‌లో స్టేటస్ నచ్చలేదా? ఈ ఫీచర్ వాడుకోవచ్చు
WhatsApp: వాట్సప్‌లో స్టేటస్ నచ్చలేదా? ఈ ఫీచర్ వాడుకోవచ్చు (image: WABetaInfo)
news18-telugu
Updated: June 27, 2019, 12:42 PM IST
వాట్సప్‌లో స్టేటస్ ఫీచర్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. వాట్సప్ అందించిన బెస్ట్ ఫీచర్లలో ఇది కూడా ఒకటి. వాట్సప్ స్టేటస్ ఫీచర్‌ని చాలామంది యూజర్లు వాడుకుంటున్నారు. అయితే స్టేటస్ ఫీచర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లున్నారు. స్టేటస్‌లో డాట్ సింబల్ కనిపిస్తుంటే మొత్తం స్టేటస్‌లు చూడకుండా ఉండలేరు. అంతేకాదు... కొందరి స్టేటస్‌లు బాగుంటాయి. ఇంకొందరి స్టేటస్‌లు నచ్చవు. నచ్చకపోయినా వాటిని చూడాల్సి వస్తుంది. ఎవరిదైనా స్టేటస్‌ నచ్చకపోతే మ్యూట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినా... లిస్ట్‌లో మాత్రం వారి స్టేటస్‌లు కనిపిస్తుంటాయి. ఇలా నచ్చనివారి స్టేటస్‌లు ఇకపై చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి స్టేటస్ నచ్చట్లేదో వారి స్టేటస్‌లు ఇక లిస్ట్‌లో కనిపించకుండా చేయొచ్చు. నచ్చనివారి స్టేటస్‌ని శాశ్వతంగా హైడ్ చేసే ఫీచర్‌ని అందించబోతోంది వాట్సప్.

ఆన్‌లైన్ పోర్టల్ WABetaInfo సమాచారం ప్రకారం ఇప్పటికే 2.19.183 ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో ఇప్పటికే హైడ్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు అందించనుంది వాట్సప్. హైడ్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందంటే మీకు ఎవరి స్టేటస్‌లు నచ్చట్లేదో వారి స్టేటస్ హైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ కావాలంటే 'షో' ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మళ్లీ వారి స్టేటస్‌లు కనిపిస్తాయి. సో... ఇక స్టేటస్‌లతో మీకు ఎదురయ్యే చికాకులు, సమస్యలు తీరినట్టే.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

E-passport: త్వరలో ఇ-పాస్‌పోర్టులు... ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసా?

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా
Loading...
WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే
First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...