Home /News /technology /

WHATSAPP NEW FEATURE THE LATEST CHAT FILTERS FEATURE FOR WHATSAPP BETA USERS LAUNCHING FOR EVERYONE SOON GH VB

WhatsApp New Feature: వాట్సాప్ బీటా యూజర్లకు సరికొత్త చాట్ ఫిల్టర్స్ ఫీచర్.. త్వరలోనే అందరికీ లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను బీటా యూజర్లకు లాంచ్ చేసింది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, చాట్ ఫిల్టర్స్ (Chat Filters) అనే కొత్త ఫీచర్‌ను మెసేజింగ్ యాప్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ బీటా టెస్టర్లకు సెర్చ్ బార్ పక్కన ఫిల్టర్ ఫీచర్‌ కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. రీసెంట్ టైమ్స్‌లో వాట్సాప్ చాలా ఫీచర్లను లాంచ్ చేసి ఓవరాల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌(Experience) మార్చేసింది. ఇటీవలే యూజర్లు(Users) ఎంతగానో ఎదురు చూస్తున్న మెసేజ్(Message) లేదా ఎమోజీ రియాక్షన్ (Emoji Reaction) ఫీచర్‌ను కూడా రెగ్యులర్(Regular) యూజర్లందరికీ పరిచయం చేసింది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను బీటా యూజర్లకు వాట్సాప్ లాంచ్ చేసింది. వాట్సాప్ బీటా(WhatsApp) ఇన్ఫో ప్రకారం, చాట్ ఫిల్టర్స్ (Chat Filters) అనే కొత్త ఫీచర్‌ను మెసేజింగ్ యాప్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ బీటా టెస్టర్లకు సెర్చ్ బార్ పక్కన ఫిల్టర్ ఫీచర్‌ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌తో అన్‌రీడ్ చాట్స్ (Unread Chats), కాంటాక్ట్స్ (Contacts), నాన్-కాంటాక్ట్స్ (Non-contacts), గ్రూప్స్ (Groups) వంటి నాలుగు కేటగిరీల కింద చాట్స్ ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఈ ఫీచర్‌తో చాలామంది యూజర్లకు సమయం ఆదా అవుతుంది. చాట్ ఫిల్టరింగ్ ఫీచర్‌తో కావాల్సిన చాట్‌లను కనుగొనడం మరింత సులభం అవుతుంది.

వాట్సాప్ స్టాండర్డ్ వెర్షన్ యూజర్లకు తీసుకొస్తున్న స్పెషల్ చాట్ ఫిల్టర్స్ (Chat Filters) ఫీచర్‌ వాట్సాప్ బిజినెస్‌ (WhatsApp Business)లో కొద్ది నెలల క్రితమే అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. వాట్సాప్ బిజినెస్ యూజర్లకు ఈ ఫిల్టర్ చాట్ సెర్చ్ విభాగంలో కనిపిస్తుంది. అయితే సాధారణ యూజర్లకు, ఈ ఫీచర్ అన్ని సమయాల్లో సెర్చ్ ఐకాన్ పక్కనే కనిపిస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ ను కూడా పంచుకుంది. ఈ స్క్రీన్‌షాట్ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ (Desktop App) నుంచి తీసుకున్నది కానీ ఈ ఫీచర్‌ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ వెర్షన్‌లలో కూడా రిలీజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందరికీ విడుదలయ్యే అవకాశం ఉంది.

Vivo Discount Offer: మూడు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో

ఈ చాట్ ఫిల్టర్స్ లో 'క్లోజ్ ఫ్రెండ్స్' అనే మరొక కేటగిరి కూడా ఉంటే బాగుండేది. ఈ ఆప్షన్ జోడించినట్లయితే క్లోజ్ ఫ్రెండ్స్ చాట్స్ ఈజీగా కనిపెట్టొచ్చు. యూజర్లందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెసేజ్ రియాక్షన్, 32 మందికి ఒకేసారి వాయిస్ కాలింగ్, పాజ్ చేసే వాయిస్ రికార్డ్ వంటి ఫీచర్‌లను ఈ ఏడాదిలో వాట్సాప్ విడుదల చేసింది. మెసేజ్ రియాక్షన్ ఫీచర్ ఇండియాలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా, వాట్సాప్ లార్జ్ ఫైల్ షేరింగ్, స్పెసిఫిక్ కాంటాక్ట్ నుంచి హైడ్ చేసే లాస్ట్ సీన్, కమ్యూనిటీస్ ఫీచర్లను కూడా పొందుతోంది. యూజర్లు భవిష్యత్తులో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో 2జీబీ వరకు ఫైల్‌లను షేర్ చేసుకోవడం వీలవుతుంది. ఇది ప్రస్తుత 100ఎంబీ గరిష్ట ఫైల్ సైజు నుంచి భారీ జంప్ అని చెప్పవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: New features, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు