WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇప్పుడు ఇక ఆ సమస్య ఉండదు.. వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

గతంలోనే ఉన్న అర్కైవ్‌‌ అనే ఆప్షన్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది వాట్సాప్‌. దీని ద్వారా మీ చాట్‌ లిస్ట్‌లో కనిపించకూడదు అనుకునే అర్కైవ్డ్‌ నెంబర్లు, గ్రూప్‌లను యూజర్లు పక్కన పెట్టవచ్చు. గతంలో అర్కైవ్ ఫీచన్‌ను ఎంచుకుంటే.. మళ్లీ ఆ వ్యక్తి లేదా గ్రూప్‌ సభ్యులు మెసేజ్‌ చేసినప్పుడు తిరిగి చాట్ లిస్ట్‌లో కనిపిస్తూ ‘అన్- అర్కైవ్‌’ అయ్యేది. అయితే ఇప్పుడు కొత్త ఆప్షన్‌లో అలా అర్కైవ్‌ చేసిన కాంటాక్ట్‌ మళ్లీ అన్-అర్కైవ్‌‌ అవ్వదు. వివరాలిలా ఉన్నాయి.

  • Share this:
ఎప్పుడో పాత స్నేహితులు గ్రూప్‌లో మిమ్మల్ని జాయిన్‌ చేశారు. ఎగ్జిట్‌ అవుదామంటే బాధపడతారేమో అనే భయం. గ్రూపలో ఉంటేనేమో ఏదో పిచ్చి పిచ్చి మెసేజ్‌లు. ఇది సంజయ్‌ బాధ.  రోజూ ఉదయాన్నే గుడ్‌ మార్నింగ్‌, మధ్యాహ్నం గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌, రాత్రి గుడ్‌ నైట్‌ మెసేజ్‌. ఒక్కోసారి అవసరం లేని ఫొటోలు డంప్‌ చేసేస్తుంటారు. బ్లాక్‌ చేస్తే... ఎందుకు చేశావ్‌ అనే ప్రశ్న. దీంతో ఆ మెసేజ్‌లు చూసి చిరాకు. ఇది విజయ్‌ బాధ. మీలో చాలామందికి వాట్సాప్‌లో ఇలాంటి సమస్యలు ఉండే ఉంటాయి. ఏం చేయాలో తెలియక ఊరుకొని ఉంటారు. అయితే ఈ రెండు రకాల బాధలకు విరుగుడు వచ్చేసింది. గతంలోనే ఉన్న అర్కైవ్‌‌ అనే ఆప్షన్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది వాట్సాప్‌. దీని ద్వారా మీ చాట్‌ లిస్ట్‌లో కనిపించకూడదు అనుకునే అర్కైవ్డ్‌ నెంబర్లు, గ్రూప్‌లను యూజర్లు పక్కన పెట్టవచ్చు. గతంలో అర్కైవ్ ఫీచన్‌ను ఎంచుకుంటే.. మళ్లీ ఆ వ్యక్తి లేదా గ్రూప్‌ సభ్యులు మెసేజ్‌ చేసినప్పుడు తిరిగి చాట్ లిస్ట్‌లో కనిపిస్తూ ‘అన్- అర్కైవ్‌’ అయ్యేది. అయితే ఇప్పుడు కొత్త ఆప్షన్‌లో అలా అర్కైవ్‌ చేసిన కాంటాక్ట్‌ మళ్లీ అన్-అర్కైవ్‌‌ అవ్వదు.

అంటే.. ఆ వ్యక్తి లేదా గ్రూప్ నుంచి కొత్త మెసేజ్ వచ్చినా, అది చాట్ లిస్ట్‌లో కనిపించదు. మళ్లీ మనం సెట్టింగ్స్ మార్చుకుంటేనే తిరిగి మామూలు చాట్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేసింది. మీ వాట్సాప్ అకౌంట్‌లో ఏదైనా కాంటాక్ట్‌, గ్రూప్‌ను అర్కైవ్‌ చేసి చూస్తే, కొత్త ఫీచర్ కనిపిస్తుంది. అయితే దానికంటే ముందు మీరు మీ వాట్సాప్‌ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి అప్‌డేట్‌ (ఉంటేనే...) చేసుకోండి. ఆ తర్వాత ట్రై చేయండి. అయితే ఇలా ఆటోమేటిక్ అన్‌అర్కైవ్‌‌ ఆపేయాలన్నా సాధ్యమే. దీనికోసం వాట్సాప్‌ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో ఛాట్స్‌ ఆప్షన్‌లోకి వెళ్తే... ‘అర్కైవ్‌డ్‌ ఛాట్స్‌’ అని ఉంటుంది. డీఫాల్ట్‌గా ఈ ఆప్షన్‌ ఎనేబుల్‌లో ఉంటుంది.

మీకు ఈ ఆప్షన్‌ వద్దనుకుంటే దానిని డిజేబుల్‌ చేసుకుంటే సరి. అప్పుడు అర్కైవ్‌‌ చేసిన వ్యక్తి /గ్రూపులో ఏదైనా మెసేజ్‌ వస్తే గతంలో మాదిరిగా అన్‌ అర్కైవ్‌‌ అయిపోతుంది. ఇక అర్కైవ్‌‌ చేసిన గ్రూపు, వ్యక్తి మెసేజ్‌లను హోం స్క్రీన్‌ టాప్‌లో ‘అర్కైవ్‌డ్‌’ అనే సెక్షన్‌లో చూపిస్తుంటారు. దానికి క్లిక్‌ చేసి మీకు కావాల్సినప్పుడు అందులో మెసేజ్‌లు చూసుకోవచ్చు. వద్దనుకుంటే అక్కడి నుంచే అన్అర్కైవ్‌‌ చేసుకోవచ్చు. మీరు అర్కైవ్‌‌ చేసిన విషయం అవతలి వ్యక్తి, గ్రూపు సభ్యులకు తెలియదు కూడా. కొన్నాళ్లపాటు దీనిని టెస్టింగ్‌ చేసిన వాట్సాప్‌ తాజాగా లాంచ్‌ చేసింది. ఒకసారి మీ యాప్‌ను అప్‌డేట్‌ చేసి కొత్త ఫీచర్‌ను చెక్‌ చేసుకోండి.
Published by:Veera Babu
First published: