Home /News /technology /

WHATSAPP NEW FEATURE ANOTHER NEW FEATURE FROM WHATSAPP NOW LARGER FILES SHARING DOWNLOADING MORE EASY GH VB

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌.. ఇక ఆ పనిని ఈజీగా చేసుకోవచ్చు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంటుంది. ఇది త్వరలోనే చాలా ఫీచర్లను లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ అప్‌కమింగ్ ఫీచర్ల (Upcoming Features)లో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసే ఫీచర్ కోసం యూజర్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంటుంది. ఇది త్వరలోనే చాలా ఫీచర్లను లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ అప్‌కమింగ్ ఫీచర్ల (Upcoming Features)లో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసే ఫీచర్ కోసం యూజర్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైల్ షేరింగ్ (File Sharing)కి సంబంధించి మరో కొత్త ఫీచర్ అందరికీ రోల్అవుట్ చేయడానికి వాట్సాప్ సిద్ధమయ్యింది. ఈ ఫీచర్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లేదా ఫైల్‌ను వాట్సాప్ సర్వర్లకు అప్‌లోడ్ చేయడానికి యూజర్లకు పట్టే ఎస్టిమేటెడ్ టైమ్ (Estimated Time)ని చూపిస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్‌టాప్ బీటా వెర్షన్ అప్‌డేట్‌లలో ఈ ఫీచర్‌ను వాట్సాప్ చేర్చింది.

వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, యూజర్లు ఏదైనా ఫైల్‌ను అప్‌లోడ్ లేదా డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు... ఫైల్ లోడింగ్ కి సంబంధించి ఎస్టిమేటెడ్ టైమ్ (Estimated Time)ని వ్యూ చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక డౌన్‌లోడ్ టైమర్‌గా పనిచేస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, ఇది డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలియజేస్తుంది. కొత్తగా 2జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్ తీసుకొస్తే.. యూజర్లు లార్జ్ ఫైల్స్ షేర్ చేయొచ్చు. అయితే ఇలా ఫైల్స్ ఎంత సమయంలోగా షేర్ అవుతాయో తెలియకపోతే స్లో నెట్ ఉన్న యూజర్లకు ఎంతోకొంత ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకే వాట్సాప్ ఈ కొత్త అప్‌డేట్‌తో ఫైల్‌ను షేర్ చేస్తున్నప్పుడు ఫైల్ పేరుతో పాటు చాట్ బబుల్‌లో కొత్త ETA (Estimated Time Of Arrival) లేబుల్‌ను ఆఫర్ చేస్తోంది.

Refurbished Phones: రీఫర్బిష్డ్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఆ మోడళ్లపై ఏకంగా 76 శాతం డిస్కౌంట్..


ఈ ఫీచర్ మొదటగా నెల క్రితం వాట్సాప్ డెస్క్‌టాప్‌లో రిలీజ్ అయింది. అనంతరం వారం రోజుల క్రితం ఆండ్రాయిడ్, ఐఓఎస్ లోని కొన్ని బీటా టెస్టర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే వాట్సాప్ విడుదల చేస్తోంది. కాబట్టి ఈ ఫీచర్‌ మీ యాప్ లో కనిపించకపోతే ఇది ఇంకా మీకు అందుబాటులోకి రాలేదని అర్థం. ఈ ఫీచర్‌ను ఇంకా రిసీవ్ చేసుకుని యూజర్లు నెక్స్ట్ అప్‌డేట్ కోసం వెయిట్ చేయాలి.

వాట్సాప్ లో మెసేజ్ రియాక్షన్స్, పోల్స్, డ్రాయింగ్ టూల్ వంటి మరిన్ని ఫీచర్లు త్వరలోనే అందరికీ పరిచయం కానున్నాయి. మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ తో కొత్తగా లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్‌, థాంక్స్, సాడ్ వంటి రియాక్షన్లను మీరు వాట్సాప్ మెసేజ్ లకు ఇవ్వవచ్చు. పోల్ ఫీచర్ ఉపయోగించి మీరు వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ స్టేటస్ లో పోలింగ్ నిర్వహించవచ్చు. ఇంకా డిసప్పియరింగ్ చాట్స్ లో ఆటోమేటిక్ మీడియా సేవింగ్ ఫీచర్ డిసేబుల్ చేసే మరొక ఫీచర్ కూడా రానుంది. దీని వల్ల యూజర్ల ప్రైవసీ మరింత మెరుగు పడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: New features, Technology, Whatsapp

తదుపరి వార్తలు