Home /News /technology /

WHATSAPP NEW CATALOG FEATURE HELPS FIND OUT WHO LEFT GROUP CHATS UMG GH

WhatsApp Groups: వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. గ్రూప్ చాట్ నుంచి వెళ్లిన వారిని ఇలా తెలుసుకోవచ్చు..!

వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. గ్రూప్ చాట్ నుంచి వెళ్లిన వారిని ఇలా తెలుసుకోవచ్చు..!

వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. గ్రూప్ చాట్ నుంచి వెళ్లిన వారిని ఇలా తెలుసుకోవచ్చు..!

వాట్సాప్ పాస్ట్ పార్టిసిపెంట్స్ (Past Participants) అనే కొత్త కేటలాగ్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు 60 రోజుల్లోగా గ్రూప్ నుంచి వెళ్లిపోయిన లేదా గ్రూప్ నుంచి తొలగించిన కాంటాక్ట్స్ ఎవరో తెలుసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తరచుగా సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ గ్రూప్స్ (Groups) కోసం కూడా మెరుగైన ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా పాస్ట్ పార్టిసిపెంట్స్ (Past Participants) అనే కొత్త కేటలాగ్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు 60 రోజుల్లోగా గ్రూప్ నుంచి వెళ్లిపోయిన లేదా గ్రూప్ నుంచి తొలగించిన కాంటాక్ట్స్ ఎవరో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ ఐఫోన్ బీటా వెర్షన్ (iPhone beta version) 22.16.0.75లో అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్ వాడే యూజర్లు తాము ఉన్న గ్రూప్‌లో నుంచి 60 రోజులలోగా వెళ్లిపోయిన వారెవరో తెలుసుకోవచ్చు.

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, అందులో ఉన్న మిగతా మెంబర్స్‌కి గ్రూప్ నుంచి రీసెంట్‌గా లెఫ్ట్ అయిన వారు ఎవరన్నది పాస్ట్ పార్టిసిపెంట్స్ తెలియజేస్తుంది. అయితే కేవలం అడ్మిన్లకు తప్ప మిగతా మెంబర్స్‌కి తెలియకుండా సైలెంట్‌గా గ్రూప్ నుంచి వెళ్లిపోయే ఆప్షన్‌ను కూడా వాట్సాప్ తీసుకొస్తోంది. దీనివల్ల ఎవరు లెఫ్ట్ అయ్యారు? అనేది అడ్మిన్లు తప్ప మిగతా వారు తెలుసుకోలేరు. అయితే పాస్ట్ పార్టిసిపెంట్స్ ఫీచర్‌తో గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన వారు ఎవరో గ్రూప్‌లో ఉన్న వారందరూ కూడా తెలుసుకోవచ్చు. గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీలో ప్రస్తుత పార్టిసిపెంట్స్ లిస్ట్‌ కింద "సీ పాస్ట్ పార్టిసిపెంట్స్" అనే కొత్త ఆప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. బ్యాన్/లెఫ్ట్ అయిన కాంటాక్ట్స్ సెర్చ్ చేయడానికి సెర్చ్ బటన్ కూడా యూజర్లకు అవైలబుల్‌లో ఉంటుంది. గ్రూప్ మెంబర్స్ తరచుగా లెఫ్ట్ అవుతూ, జాయిన్ అవుతూ ఉంటే ఈ సెర్చ్ బటన్ అనేది ఉపయోగకరంగా ఉండవచ్చు.



బిజినెస్ గురించి కమ్యూనికేట్ అయ్యేందుకు క్రియేట్ చేసిన గ్రూప్స్‌లో పాస్ట్ పార్టిసిపెంట్స్ ఫీచర్ బాగా ఉపయోగపడవచ్చు. వాట్సాప్ గ్రూప్స్‌ను ఉపయోగించే చిన్న వ్యాపారాలకు కూడా ఈ ఫీచర్ సహాయకరంగా ఉండవచ్చు. ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే పార్టిసిపెంట్స్ సంఖ్యను 256 నుంచి 512కు పెంచింది. దీనివల్ల గ్రూప్‌లో తరచుగా వందల సంఖ్యలో యూజర్లు లెఫ్ట్ అవుతుంటే వారిని ట్రాక్ చేయడం కష్టమవుతుంది. అందుకే పాస్ట్ పార్టిసిపెంట్స్ ఫీచర్‌లోనే సెర్చ్ బటన్ కూడా వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి రాగా.. త్వరలోనే ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ ఇతరులకు కూడా రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.

ఇంకా గ్రూప్‌లో చాలా ఫీచర్స్‌ను పరిచయం చేయాలని వాట్సాప్ యోచిస్తోంది. కమ్యూనిటీస్‌, గ్రూప్ అడ్మిన్లకు మెసేజ్‌లను డిలీట్ చేసే సామర్థ్యం అందించడం, కొన్ని గ్రూప్ నుంచి నంబర్స్ హైడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. అలాగే లాగిన్ ప్రాసెస్ మరింత ఈజీగా, సేఫ్‌గా ఉండే ఒక అతను అథెంటికేషన్ ప్రాసెస్ తీసుకురానుంది. స్టేటస్‌లకు రియాక్ట్ అయ్యే వీలును కూడా కల్పించనుంది.
Published by:Mahesh
First published:

Tags: Chat, New feature, Whatsapp, Whatsapp tricks

తదుపరి వార్తలు