Whatsapp Feature: అదిరిపోయే ఫీచ‌ర్‌.. సేవ్‌కాని నంబ‌ర్ల‌కు వాట్స‌ప్‌ మెసేజ్‌ చేయొచ్చు

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్ (Whatsapp) తాజాగా ఓ కొత్త ఫీచర్ (Feature) మన ముందుకు వ‌స్తోంది. వాట్సాప్‌లో సేవ్‌లేని నంబర్లకు మెసేజ్ (Message) చేసేలా కొత్త ఫీచ‌ర్ అందిస్తోంది. మన ఫోన్ లో సేవ్ కాని నంబర్లకు వాట్సప్ మెసేజ్ ఎలా చేయాలో తెలుసుకొందాం.

  • Share this:
    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whats App) అంటే తెలియని వారుండరు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఎన్నో మెసేజ్ యాప్‌లు వ‌స్తున్నా వాట్స‌ప్ స్థానం మాత్రం చెక్కు చెద‌ర‌కుండా ఉంది. అందుకు కార‌ణం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీజర్లను జోడిస్తోంది. ఇదే స్పీడ్ లో వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్ మన ముందుకు వ‌స్తోంది. ఈ సారి వాట్స‌ప్ మ‌న‌కు అందిస్తున్న ఫీచ‌ర్ ఎంటో తెలుసా వాట్సాప్‌లో సేవ్‌లేని నంబర్లకు మెసేజ్ (Message) చేసేలా కొత్త ఫీచ‌ర్ అందిస్తోంది. వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్‌ చేయాలంటే కచ్చితంగా ఫలనా వ్యక్తి నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. సేవ్‌ చేస్తేనే వాట్సాప్‌ యాప్‌లో ఆయా వ్యక్తి నంబరు కన్పిస్తోంది. దీని వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో మ‌నం ఇబ్బంది ప‌డ‌తాం. మెసేజ్ వెంట‌నే చేయ‌లేం. ఇక ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌నుంది. వాట్స‌ప్ అందిస్తున్న ఈ కొత్త ఫీచ‌ర్‌.

    మ‌న ఫోన్‌లో లేని నంబ‌ర్‌కు కూడా వాట్స‌ప్ ఎలా చేయాలో తెలుసుకొందాం
    - మీ ఫోన్‌లో బ్రౌజ‌ర్‌ను తెర‌వాలి.
    - అనంత‌రం http://wa.me/91xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి.
    - ఇక్క‌డ 91 అంటే ఇండియా కంట్రీ కోడ్ అనంత‌రం మీరు ఎవ‌రి మెసేజ్ చేయాల‌నుకొంటున్నారో వారి నంబ‌ర్ న‌మోదు చేయాలి.
    - అనంత‌రం లింక్ తెర‌వ‌డానికి ఎంట‌ర్ ప్రెస్ చేయాలి.
    - త‌రువాత ప్ర‌త్యేక పేజ్ ఓపెన్ అవుతంది. అక్క‌డ మెసేజ్ చేయొచ్చు.
    - ఈ విధంగా నంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే వాట్స‌ప్‌లో మెసేజ్ చేసుకోవ‌చ్చు.

    Facebook : ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌గా మాజీ ఐఏఎస్ అధికారి


    ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే వారికి వాట్స‌ప్ ఫీచ‌ర్..
    ఐఫోన్ వినియోగదారులు తమ వాట్సాప్ డేటా(Whatsapp Data)ను ఇత‌ర ఓస్‌ స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేయడానికి అవసరమైన అవసరాల యొక్క సుదీర్ఘ జాబితాను కూడా వాట్సాప్ అందించింది. ఈ జాబితాలో మొదటిది శామ్‌సంగ్ స్మార్ట్‌స్విచ్ యాప్. ఈ ఫీచ‌ర్ వినియోగించుకోవాలంటే ఈ శామ్‌సంగ్ ఫోన్‌లో 3.7.22.1 లేదా అంతకంటే ఎక్కువ వ‌ర్ష‌న్ వాట్స‌ప్‌ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.అలాగే మీ ఐఓఎస్ కూడా iOS 2.21.160.17 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ గ‌ల వాట్స‌ప్ క‌లిగి ఉండాలి. ఆండ్రాయిడ్ అయితే 2.21.16.20 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న వాట్సాప్ ఉండాలి. యూఎస్‌బీ-సీ(USB-C) టైప్ ఉండాలి


    ఇలా చేయాలి..
    - మొదట మీ శామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను ఆన్ చేసి కేబుల్ ద్వారా ఐఫోన్‌కు కనెక్ట్ చేయాలి.
    - సూచ‌న‌లు అనుస‌రిస్తూ శామ్‌సంగ్ స్మార్ట్ స్విచ్ యాప్ ద్వారా ఐఫోన్ కెమెరాతో కొత్త పరికరంలో ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి.
    - అనంత‌రం ప్రక్రియ పూర్తయ్యే వరకు రెండు ఫోన్‌లు ఆన్‌లో ఉంచాలి.
    - అనంత‌రం ప్ర‌క్రియ పూర్త‌యి త‌ర్వాత‌ మీరు వాట్సాప్ ను ఓపెన్ చేసి మీరు మీ పాత పరికరంలో ఉపయోగిస్తున్న అదే నంబర్‌తో లాగిన్ అవ్వండి.
    - తరువాత ఇంపోర్ట్ డేటా ఎంపికపై నొక్కి.. ప్ర‌క్రియ పూర్త‌య్యే దాకా వేచి చూడాలి.
    ఈ టెక్నిక్ ఉపయోగించి వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ సమాచారం, ప్రొఫైల్ ఫోటోలు, చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, మీడియా మరియు సెట్టింగ్‌లను బదిలీ చేయవచ్చు. అయితే వారి కాల్ హిస్టరీ లేదా వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లకు కనిపించే మీ డిస్‌ప్లే పేరు బదిలీ చేయబడదు.
    ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ కేవ‌లం ఆండ్రాయిడ్ 10(Android 10) ఆపై న‌డుస్తున్న శామ్‌సంగ్ ప‌రిక‌రాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. భ‌విష్య‌త్‌లో మ‌రింత మెరుగైన ఫీచ‌ర్ అంద‌రికీ అందుబాటులో ఉండేలా వాట్స‌ప్ ప్ర‌య‌త్నిస్తుంది.

    Published by:Sharath Chandra
    First published: