Whatsapp: ఆ ఫోన్లు వాడేవాళ్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్

డార్క్‌మోడ్‌తో IOS బీటా వర్షన్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేసినట్లు తెలిపింది. ఐవోఎస్ బీటా వర్షన్‌ను 2.20.20కి అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్ లభిస్తుంది. బీటా వర్షన్ అప్‌డేట్ చేసిన తర్వాత వాట్సాప్‌లో డీఫాల్డ్ డార్క్ స్ప్లాష్ స్క్రీన్ కనిపిస్తుంది.


Updated: January 30, 2020, 6:51 PM IST
Whatsapp: ఆ ఫోన్లు వాడేవాళ్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తూ యూజర్లకు సరికొత్త ఎక్స్‌‌పీరియెన్స్‌ని పరిచయం చేస్తోంది. నిత్యం అప్‌డేట్ అవుతూ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల డార్క్‌మోడ్‌ని తీసుకొచ్చింది వాట్సాప్. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. 2.20.13 అప్‌డేట్ చేసిన వాట్సప్ అప్లికేషన్‌లో ఈ డార్క్‌ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాడుతున్న ఎంతో మంది యూజర్లు.. చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ ఆప్షన్ కనిపించబోతోంది.

ఇక ఐఫోన్ యూజర్లు కూడా ఎప్పుడెప్పుడు డార్క్ మోడ్ ఫీచర్ వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిందరికీ గుడ్‌న్యూస్ చెప్పింది వాట్సాప్. డార్క్‌మోడ్‌తో IOS బీటా వర్షన్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేసినట్లు తెలిపింది. ఐవోఎస్ బీటా వర్షన్‌ను 2.20.20కి అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్ లభిస్తుంది. బీటా వర్షన్ అప్‌డేట్ చేసిన తర్వాత వాట్సాప్‌లో డీఫాల్డ్ డార్క్ స్ప్లాష్ స్క్రీన్ కనిపిస్తుంది. ఫార్వార్డ్, గ్రూప్, ఫ్రొఫైల్ ఐకాన్స్‌కి సంబంధించి డార్క్ థీమ్స్ సైతం అప్‌డేట్ చేసింది వాట్సాప్. మరెందుకు ఆలస్యం మీ ఐఫోన్‌లో వాట్సాప్ బీటా వర్షన్‌ను అప్‌డేట్ చేసి డార్క్ మోడ్‌ ఫీచర్‌ని ఆస్వాదించండి.
Published by: Shiva Kumar Addula
First published: January 30, 2020, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading